
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగుతోంది. ఈ యుద్దం ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వైపు సంధి ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినా.. యుద్ధం మాత్రం ఆగలేదు. అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా.. పలు దేశాల్లో ఉక్రెయిన్ కి మద్దతు తెలుపుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో లాస్ వెగాస్ లో చాలా మంది యువత.. ఉక్రెయిన్ కి మద్దతుగా... రష్యన్ వోడ్కా ని కొనుగోలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చేవారు.. రష్యన్ వోడ్కా ని కొనుగోలు చేయడమేంటా అని అనుమానం కలుగుతుందా..? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వారు రష్యాకి ఆదాయం కోసం ఆ వోడ్కాని కొనుగోలు చేయలేదు. దానిని పారబోయడానికి వారు కొనుగోలు చేయడం గమనార్హం.
యునైటెడ్ స్టేట్స్‌లోని టిప్పలర్‌లు మానవతావాద సహాయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి తమ బాధ్యతను స్వీకరించారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేయడానికి,యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి వారు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆశ్రయించారు. వోడ్కాను కాలువలో పారపోయడం గమనార్హం.
లాస్ వెగాస్‌లోని ఒక బార్ లోని రష్యన్ వోడ్కాను కొనుగోలు చేసి మరీ.. వాటిని కాలువలో పోసి వారి నిరసనను తెలియజేశారు. ఇక నుంచి తాము రష్యన్ మద్యాన్ని వినియోగించమని.. ఆ స్థానంలో.. ఉక్రెయిన్ మద్యాన్ని వినియోగిస్తామని వారు చెప్పడం గమనార్హం.
టాయిలెట్‌లో రష్యన్ వోడ్కా బాటిళ్లను పోయడానికి కస్టమర్‌లు 300 అమెరికన్ డాలర్లు విరాళంగా ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం.