Russia Ukraine war: యుద్ధోన్మాదం.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసం

Published : Mar 21, 2022, 02:34 AM IST
Russia Ukraine war: యుద్ధోన్మాదం.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసం

సారాంశం

Russia Ukraine war: తాజాగా ఉక్రెయిన్ నగ‌రాల‌పై  ర‌ష్య‌న్ బ‌లాగాలు బాంబుల వ‌ర్షాన్ని కురిపించాయి.  ఐరోపాలోనే అత్యంత పెద్దదైన ఉక్కు కర్మాగారం అజోవ్‌స్టాల్‌పై క్షిప‌ణి దాడులు చేసింది. ఈ దాడిలో ఉక్కు ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ చట్ట సభ్యులు లెసియా వాసిలెంకో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.   

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై ర‌ష్యా రోజురోజుకు దాడిని తీవ్రత‌రం చేస్తుంది. గ‌త 25 రోజులుగా ఉక్రెయిన్ పై ర‌ష్యా దండయాత్ర కొన‌సాగిస్తోంది. ప్ర‌పంచ‌దేశాలు శాంతి మంత్రాన్ని జ‌పిస్తున్న‌.. పుతిన్ మాత్రం న‌ర‌మేధాన్ని ఆప‌డం లేదు. మ‌రోవైపు బాధిత దేశం ఉక్రెయిన్ శాంతి చ‌ర్య‌ల‌ను ఆహ్వానిస్తున్నా.. ర‌ష్యా వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. పుతిన్ త‌న యుద్దోన్మాదంతో దాడుల‌ను మ‌రింత తీవ్రం చేస్తున్నారు. ర‌ష్యా  యుద్ద‌రీతికి విరుద్దంగా.. అమాయ‌క పౌరుల‌పై.. నివాస స్థలాల‌పై.. శ‌రార్థుల స్థావ‌రాల‌పై వైమానిక దాడులు చేస్తోంది. 

తాజాగా ఆదివారం ర‌ష్య‌న్ బ‌లాగాలు ఉక్రెయిన్ నగ‌రాల‌పై బాంబుల వ‌ర్షాన్ని కురిపించాయి. తాజాగా ఐరోపాలోనే అత్యంత పెద్దదైన ఉక్కు కర్మాగారం అజోవ్‌స్టాల్‌పై క్షిప‌ణి దాడులు చేసింది. ఈ దాడిలో ఉక్కు ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. ఉక్రెయిన్ ఓడరేవు నగరం మారియుపోల్‌ను రష్యా దళాలు ముట్టడించడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ చట్ట సభ్యులు లెసియా వాసిలెంకో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యూరప్‌లోనే అతిపెద్ద మెటలర్జిక్ ప్లాంట్లలో ఒకటి ధ్వంసమైంది. ఉక్రేనియన్లకు ఇది అతిపెద్ద ఆర్థిక  నష్టం.   పర్యావరణం కూడా దారుణంగా దెబ్బతింది అని లెసియో ట్వీట్‌లో పేర్కొన్నారు.

దాడి కారణంగా పేలిపోతున్న ఫ్యాక్టరీ వీడియోను లెసియా పోస్టు చేశారు. ఈ ఘ‌ట‌నపై అజోవ్‌స్టల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి మెసేజింగ్ టెలిగ్రామ్’ యాప్ ద్వారా స్పందించారు. "మేము త్వ‌ర‌లోనే నగరానికి తిరిగి వస్తాము, కర్మాగారాన్ని పునర్నిర్మిస్తాము. దానిని పునరుద్ధరిస్తాము" అని అజోవ్‌స్టల్ డైరెక్టర్ తెలిపారు.  రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పుడే పర్యావరణ నష్టం పెద్దగా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. మెటిన్‌వెస్ట్ గ్రూపులో భాగమైన అజోవ్‌స్టాల్‌ను ఉక్రెయిన్ సంపన్నుడు రినాట్ అఖ్‌మెటోవ్ నియంత్రణలో ఉంది.  

ఇంకొకవైపు 400 మంది ఆశ్రయం పొందిన స్కూల్‌పై దాడులు చేశాయి. మేరియుపోల్‌లోని ఆర్ట్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని ఆ నగర పాలక మండలి తెలిపింది. బాంబుల దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైందని, అందులోని శరణార్థులు శిథిలాల్లో చిక్కుకున్నారని చెప్పింది. అయితే ఎంత మంది మరణిం చారన్నది తెలియరాలేదు. మరోవైపు అజోవ్‌ సముద్రంలోని వ్యూహాత్మక నౌకాశ్రయమైన మేరియుపోల్‌ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఆహారం, నీటి సరఫరాను బంద్‌ చేయడంతోపాటు నగరంపై బాంబు దాడులను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి దాడుల్లో యూరప్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసమైంది.


 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే