
Russia Ukraine War: గత రెండు నెలలుగా.. రష్యా ఉక్రెయిన్ పై బాంబు దాడులు చేస్తుంది. రోజురోజుకు ఈ యుద్దం తీవ్రమతోంది. బాంబులు, క్షిపణులు, విమానాల దాడులతో ఉక్రెయిన్ తన రూపు రేఖలను కోల్పోయింది. ఇప్పటికే లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇక రష్యా.. ప్రధాన నగరాలు, ఆస్పత్రులు, సామాన్య ప్రజల నివాస సముదాయాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్ నగరం తమ చేతుల్లో ఉందని రష్యా ప్రకటించింది. అయితే.. ఈ ప్రకటనపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న ప్రశ్నించదగ్గదని అన్నారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ కు అమెరికా మరోసారి అండగా నిలబడింది. రష్యాపై ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతుగా 800 మిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని అందిస్తోన్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక ప్యాకేజీలో అవసరమైన భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ బలగాలకు అమెరికా అందజేయనుంది.
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య యుద్ధం ఉదృతమైన నేపథ్యంలో ఈ మేరకు సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. కాగా ఉక్రెయిన్ పోర్ట్ నగరం మారియుపోల్‌కు విజయవంతంగా విముక్తి కల్పించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే.. ఉక్రెయిన్ ప్రభుత్వానికి అమెరికా US $ 500 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని జో బిడెన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య యుద్ధం ఉదృతమైన నేపథ్యంలో ఈ మేరకు సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. యుక్రెయిన్ తన పోరాటాన్ని కొనసాగించాలనీ, ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. కొత్త ప్యాకేజీ రాబోయే కొద్ది వారాల్లో ఉక్రెయిన్‌లోకి ఆయుధాల స్థిరమైన ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది అని బిడెన్ నొక్కిచెప్పారు. కైవ్ యుద్ధం ఉక్రేనియన్లకు చారిత్రాత్మక విజయమని, సహాయాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్‌పై గురువారం తీవ్ర బాంబు దాడి జరిగిందని ఖార్కివ్ మేయర్ ఇహోర్ టెరెఖోవ్ తెలిపారు. భారీ పేలుళ్లతో నగరం చాలా దెబ్బ తిన్నదని టెరెఖోవ్ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. ఈశాన్య నగరంలో దాదాపు మిలియన్ మంది ప్రజలు మిగిలి ఉన్నారని, జనాభాలో 30% మంది ఖాళీ చేయబడ్డారని, ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని తెలిపారు.