
కాబూల్: Afghanistanలో గురువారం నాడు వరుస Bomb Blast పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. Kabul సహా ఐదు చోట్ల పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు 65 మంది గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని బాల్క్ ఫ్రావిన్స్ రాజధాని మజార్ ఎ షరీఫ్ లోని సెహ్ డోకాన్ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకొంది. షియా మసీదులో పేలుడు చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడులో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారని నివేదికలు అందుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.