Russia Ukraine Crisis : "ఆపరేషన్ గంగా" విజ‌యవంతం.. 63 విమానాలు,13,300 మంది ప్ర‌యాణీకులు

Published : Mar 06, 2022, 04:05 AM IST
Russia Ukraine Crisis : "ఆపరేషన్ గంగా" విజ‌యవంతం.. 63 విమానాలు,13,300 మంది ప్ర‌యాణీకులు

సారాంశం

Russia Ukraine Crisis : యుద్ద‌భూమి ఉక్రెయిన్ లో చిక్కుకున్న దాదాపు భారతీయులందరినీ సురక్షితంగా తరలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ  ఆపరేషన్ గంగా కింద 63 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి 13,300 మంది భారత్‌కు తిరిగి వచ్చారని, గత 24 గంటల్లో 15 విమానాలు దాదాపు 2,900 మందిని సుర‌క్షితంగా స్వ‌దేశానికి చేరుకున్నార‌ని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Russia Ukraine Crisis : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆగ‌డం లేదు. ఇరు దేశాల మ‌ధ్య‌ వరుసగా ప‌దో రోజు కూడా భీకర యుద్ధం జ‌రుగుతోంది.  ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని పలు   న‌గరాల‌ను ఆక్ర‌మించిన ర‌ష్యా.. శ‌నివారం కూడా  ఉక్రెయిన్ లోని పలు న‌గ‌రాల‌పై  బాంబుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్ సిటీతో సహా చెర్నిహివ్, ఖార్కివ్, ఖేర్సన్, మైకోలైవ్ నగరాలపై దాడుల‌ను కొన‌సాగించింది. కీవ్ ను ఆక్ర‌మించ‌కుండా.. ర‌ష్యా బలగాల‌ను నిరోధించ‌డానికి  ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరోచితంగా పోరాడుతున్నారు. 

ఇదిలాఉంటే.. యుద్ద‌భూమి ఉక్రెయిన్ లో చిక్కుకున్న దాదాపు భారతీయులందరినీ సురక్షితంగా తరలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు భారతీయులందరూ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరాన్ని విడిచిపెట్టారని, ఉక్రెయిన్‌లో ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారో ఇప్పుడు చూస్తామని  Ms బాగ్చీ చెప్పారు.  భారత రాయబార కార్యాలయం అక్కడ ఉండే అవకాశం ఉన్నవారిని సంప్రదిస్తుందని, అయితే ఇంకా కొందరి పేర్లు నమోదు చేసుకోలేదని చెప్పారు. అదే సమయంలో, సుమీ లో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా తీసుక‌రావ‌డమే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. సుమీలో హింస కొనసాగుతోంది. దీంతో పాటు ఇక్కడికి రవాణా సౌకర్యం కరువైంది. 

ఆపరేషన్ గంగా కింద ఇప్పటివరకు 63 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 13,300 మంది భారత్‌కు చేరుకున్నార‌నీ, గత 24 గంటల్లో 15 విమానాలు దాదాపు 2,900 మందిని సుర‌క్షితంగా స్వ‌దేశానికి చేరుకున్నార‌ని, మరో 24 గంటల్లో మరో 13 విమాన షెడ్యూల్‌లు ఉన్నాయని తెలిపారు  
తాము పిసోచిన్ నుండి 298 మంది విద్యార్థులను తరలించామనీ, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు బస్సులు పిసోచిన్‌కు చేరుకున్నాయని, త్వరలో పశ్చిమ దిశగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు. బహుశా ఒక నేపాలీ పౌరుడు నేడు (ఇండియన్ ఫ్లైట్‌లో) వస్తారని, బంగ్లాదేశ్ జాతీయుడు కూడా తర్వాత వస్తారని బాగ్చి తెలిపారు. 

ఇదిలా ఉండగా, భారత పౌరుల తరలింపు కోసం వివాద పీడిత ఉక్రెయిన్‌లో పరిస్థితిని చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు.  ఇదే అంశానికి పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 13,000 మందికి పైగా పౌరులు భారతదేశానికి చేరుకున్నారని, ఇది ఎన్నికలపైనా, ప్రజలపైనా సానుకూల ప్రభావం చూపింది. జనవరి నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మార్చి 4 నాటికి  ఉక్రెయిన్ నుండి 16,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామని అమిత్ వెల్లడించారు.

ర‌ష్యా వైమానిక దాడుల‌పై నేప‌థ్యంలో ఫిబ్రవరి 24 నాటి నుంచి..  ఉక్రేనియన్ గగనతలం మూసివేసింది.అటువంటి పరిస్థితిలో, భారతదేశ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగా  కార్య‌క‌మంలో భాగంగా..  భార‌తీయ  పౌరులను ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి రొమేనియా, హంగేరి, స్లోవేకియా,పోలాండ్ నుండి ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తోంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, గోఫస్ట్, స్పైస్‌జెట్, ఎయిర్ ఏషియా ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న తరలింపు విమానాలు కాకుండా, ఉక్రెయిన్ నుండి చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడంలో భారత వైమానిక దళం కూడా ప్రభుత్వానికి సహాయం అందిస్తుంది.  

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి