Russia Ukraine Crisis : ర‌ష్యా సైనికుల దాడిలో ఏడుగురు పౌరుల మృతి.. కైవ్ స‌మీపంలో ఘ‌ట‌న‌..

Published : Mar 13, 2022, 08:55 AM IST
Russia Ukraine Crisis : ర‌ష్యా సైనికుల దాడిలో ఏడుగురు పౌరుల మృతి.. కైవ్ స‌మీపంలో ఘ‌ట‌న‌..

సారాంశం

ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. రష్యా తన దండయాత్రను మొదలు పెట్టి ఇప్పటికే రెండు వారాలు దాటింది. దీని వల్ల ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. తాజాగా రష్యా జరిపిన కాల్పుల్లో ఉక్రెయిన్ కు చెందిన ఏడుగురు సాధారణ పౌరులు మరణించారు. 

ఉక్రెయిన్ (Ukraine), ర‌ష్యా (Russia)కు మ‌ధ్య యుద్జం కొన‌సాగిస్తోంది. ఎవరెన్నీ చెప్పినా ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ (putin) ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న మొండి ప‌ట్టును విడ‌నాడ‌టం లేదు. దీంతో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బ‌తింటోంది. ముఖ్య‌న‌గ‌రాలన్నీ విధ్వంసానికి గుర‌వుతున్నాయి. తీవ్ర ఆస్తి న‌ష్టం, ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. 

ర‌ష్యా దాడిని ఉక్రెయిన్ సేన‌లు తిప్పికొడుతున్నాయి. దీంతో రష్యావైపు కూడా న‌ష్టం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ర‌ష్యా త‌న సైన్యంలోని ముఖ్య అధికారులు అయిన మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ల‌ను కోల్పొయింది. సైనికులు మృత్యువాత ప‌డుతున్నారు. ర‌ష్యా ఆర్మీ (Russia army)కి చెందిన ప‌లు హెలిక్యాప్ట‌ర్ల‌ను ఉక్రెయిన్ నేల‌మట్టం చేసింది. పుతిన్ సైన్యాన్ని తిప్పికొడుతున్నాయి. ఈ క్ర‌మంలో రెండు దేశాల‌కు న‌ష్టం జ‌రుగుతోంది. యుద్ధం నిలిపివేసేందుకు ఇటీవ‌ల  రెండు దేశాల‌కు మ‌ధ్య మూడో సారి శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఇవి విఫ‌లం అయ్యాయి. అయితే మాన‌వాత దృక్ప‌థంతో పౌరుల‌ను త‌ర‌లించే స‌మ‌యంలో కాల్పుల విర‌మణ అమలు చేస్తామ‌ని ర‌ష్యా హామీ ఇచ్చింది. దీనిని నెర‌వేర్చింది. ఈ స‌మ‌యంలో అనేక మంది వివిధ దేశాల పౌరులను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఇందులో ఇండియాకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. 

ఇదిలా ఉండ‌గా సాధార‌ణ పౌరుల‌ను త‌ర‌లిస్తున్న క్ర‌మంలో ర‌ష్యా సైనికులు జ‌రిగిన కాల్పులు 7 గురు మ‌ర‌ణించిన‌ట్టు ఉక్రెయిన్ తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరమైన మారియుపోల్‌ (Mariupol)లో 80 మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న ఒక మసీదుపై రష్యా దళాలు షెల్టర్‌తో దాడి చేశాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. మెలిటోపోల్ మేయర్‌ (Melitopol mayor)ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ చెప్పిన తర్వాత ఇది చోటు చేసుకుంది. 

రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో పాశ్చాత్య మిత్రదేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను పెంచుతున్నాయి. రష్యా సముద్రపు ఆహారం, వోడ్కా(vodka), వజ్రాల (diamonds)పై US నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్‌తో పాటు రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతులను నిషేధించింది.

రష్యా బలగాలు ఉత్తరం, పశ్చిమం,  ఈశాన్యం నుంచి రాజధానికి దగ్గరగా ఉన్నాయి. రష్యా నగరానికి దక్షిణంగా ఉన్న వాసిల్కివ్ (Vasylkiv)పట్టణంలోని విమానాశ్రయాన్ని కూడా ధ్వంసం చేసింది. అయితే కైవ్ (Kyiv) సమీపంలోని ఒక గ్రామం నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్న మహిళలు, పిల్లల సమూహంపై ర‌ష్యా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మరణించారు.

కాగా ర‌ష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1,300 ఉక్రేనియన్ సైనికులు మృతి చెందార‌ని ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ప్ర‌క‌టించారు. అయితే ఉక్రెయిన్ బలగాల మృతికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌డం ఇదే మొద‌టిసారి. ఇదిలా ఉండ‌గా.. ర‌ష్యా దాడి వ‌ల్ల ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోతున్న శ‌ర‌ణార్థుల‌కు బ్రిట‌న్ (Britain) అండ‌గా నిలుస్తామ‌ని తెలిపింది. ఉక్రెయిన్ లో ఉన్న పౌరులకు ఇంటిని అందించ‌డానికి  సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ‘‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ ’’ (Homes for Ukraine) అనే కొత్త పథకం ప్రారంభిస్తామని తెలపింది. దీని ద్వారా బ్రిటన్ లో ఉక్రెయిన్ పౌరుల‌కు ఎలాంటి సంబంధాలు లేక‌పోయినా.. ఇక్క‌డ ఉండ‌టానికి అవ‌కాశం క‌లిస్తామ‌ని ప్ర‌భుత్వం ఆదివారం పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే