Russia Ukraine Crisis : పుతిన్ అణు హెచ్చరిక ప్రమాదకరమైనది, బాధ్యతా రహితమైనది - నాటో

Published : Feb 27, 2022, 11:51 PM IST
Russia Ukraine Crisis : పుతిన్ అణు హెచ్చరిక ప్రమాదకరమైనది, బాధ్యతా రహితమైనది - నాటో

సారాంశం

పుతిన్ తమ దేశ అణ్వాయుధాల‌ను అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని తీసుకున్న నిర్ణయంపై నాటో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రకటన ప్రమాదకరమైనది, బాధ్యతా రహితమైనది అని హెచ్చరించింది. 

ఉక్రెయిన్ (Ukraine) పై ర‌ష్యా దూకుడు త‌గ్గించ‌డం లేదు. కైవ్ (kyiv) న‌గ‌రంపై పుతిన్ (putin) సేన‌లు బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ర‌ష్యా బ‌ల‌గాల‌ను ఉక్రెయిన్ సైనికులు ఎదుర్కొంటున్నారు. ఒంట‌రిగా పోరాతున్న ర‌ష్యాకు ప‌లు దేశాలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఆర్థిక సాయంతో పాటు యుద్ద ర‌క్ష‌ణ సామగ్రిని, ఇత‌ర ప‌రిక‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. త‌మ దేశానికి ఇత‌ర దేశాల స‌హాయం అందుతోంద‌ని అంద‌రికీ ధన్య‌వాదాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించారు. 

ఇలా ర‌ష్యాకు, ఉక్రెయిన్ కు భీక‌రంగా యుద్ధం జ‌రుగుతున్ననేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు చేసిన ఓ ప్ర‌క‌ట‌న ప్ర‌పంచ దేశాల‌ను భ‌యం గుప్పిట్లోకి నెట్టేశాయి. త‌మ దేశ అణ్వాయుధాల‌ను అప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై ప‌లు దేశాలు మండిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో నాటో దీనిపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాలను అప్రమత్తంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం బాధ్యతా రహిత్యంగా ఉంద‌ని NATO ఆదివారం ఆరోపించింది. ‘‘ ఇది ప్రమాదకరమైన వాక్చాతుర్యం. ఇది బాధ్యతారహితమైన ప్రవర్తన’’ అని ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ CNN వార్తా సంస్థతో తెలిపారు. 

ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాల జాబితాలో రష్యా (russia) రెండో స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో భారీగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. రష్యా ఆర్మీ (russia army) వెన్నెముకగా కూడా ఇవే ఉన్నాయి. ఆదివారం ఉన్నత అధికారులతో కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) ఓ సమావేశంలో మాట్లాడారు. నాటో కూటమిలోని దేశాలు తమ దేశంపై దూకుడుగా, దుందుడుకుగా వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడమే కాక.. నోరు కూడా అదుపులో పెట్టుకోవడం లేదని అన్నారు. రష్యా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌పైనా ఆంక్షలు విధిస్తున్నట్టు నాటో దేశాలు ప్రకటించాయ‌ని చెప్పారు. 

ఈ నేపథ్యంలోనే తాను తమ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌ (chief of general staff) కూ న్యూక్లియర్ డిటరెంట్ ఫోర్సెస్‌ (nuclear deterrence force)ను హై అలర్ట్‌ (high alert)గా ఉంచాలని ఆదేశించినట్టు పుతిన్ వివరించారు. స్పెషల్ రెజైమ్ ఆఫ్ కంబాట్ డ్యూటీ మోడ్‌ (Special Regime of Combat Duty Mode)లో ఉండాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు తమ దేశంపట్ల ఎలా వ్యవహరిస్తున్నామో అందరూ చూడవచ్చునని ఆయన తెలిపారు. ఆర్థికంగా చట్ట విరుద్ధ ఆంక్షలు విధించడమే కాదు.. తమను శత్రువుగా చూస్తున్నాయని పేర్కొన్నారు. తమ దేశంపట్ల దూకుడుగా వ్యాఖ్యలు చేయడాన్ని నాటోకు సారథ్యం వహిస్తున్న నేతలు ఆమోదిస్తున్నారని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి