
ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా దాడి చేస్తోంది. దీనిని ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ఒంటరిగానే రష్యా సైనికులతో పోరాటం చేస్తోంది. ప్రపంచ దేశాలు తమకు మద్దతు ఇవ్వడం లేదని, తాము ఒంటరిమై పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ ప్రకటించడంతో శనివారం చాలా దేశాల స్పందించాయి. ఉక్రెయిన్ కు రక్షణ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఇందులో జర్మనీ కూడా ఉంది. అయితే జర్మనీ ఇలా చేయడం ఆ దేశ రక్షణ, విదేశీ విధానానికి వ్యతిరేకం. కానీ కొన్ని ఉక్రెయిన్ ఒంటరి కావడం, జర్మనీపై పోలాండ్ పోలాండ్ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ దేశం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పంపించాలని నిర్ణయించింది.
ఉక్రెయిన్ కు జర్మనీ మద్దతు ప్రకటించి ఆయుధాలు పంపించాలని ప్రకటించిన కొన్ని గంటల తరువాత ఆ దేశం మరో నిర్ణయం తీసుకుంది. తన రక్షణ, విదేశీ విధానాల్లో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టాలని
ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆదివారం ప్రకటించారు. ప్రచ్చన్న యుద్ధం అనంతరం అపరాధభావంతో ఉన్న జర్మనీ.. ఎప్పుడూ సంఘర్షణల విషయంలో ప్రపంచ వేదికపై శాంతిగా, నిశబ్దంగా వ్యవహరిస్తోంది.
అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో జర్మనీ ఆదివారం నాడు అత్యవసర పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్ సంక్షోభంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓలాఫ్ స్కోల్జ్ స్వయంగా ‘‘ ఉక్రెయిన్ దాడితో మనం ఇప్పుడు కొత్త శకంలో ఉన్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు, సామగ్రి ప్రకటించడం ద్వారా వివాద ప్రాంతాలకు ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులపై నిషేధ విధానాన్ని నాటకీయంగా తిప్పికొట్టింది.ఇది జరిగిన కొన్ని గంటల తరువాత 2022 సంవత్సరంలో సైన్యంపై పెట్టుబడుల కోసం 100 బిలియన్ యూరోలు ($113 బిలియన్లు) కేటాయిస్తున్నామని స్కోల్జ్ ప్రకటించారు. ఇప్పటి నుంచి సంవత్సరంలో తమ రక్షణ కోసం స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతానికి పైగా పెట్టుబడి పెడతామని తెలిపారు. ఉక్రెయిన్ పై పుతిన్ చర్యలు వల్ల జర్మనీ దేశ భద్రతపై స్పష్టంగా పెట్టుబడి పెట్టేలా చేసిందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలను విశ్వసనీయంగా రక్షించే శక్తివంతమైన, అత్యాధునికమైన సైన్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపారు.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుంచి పునరేకీకరణ సమయంలో జర్మనీ తన సైనిక దళాల బలాన్ని 500,000 నుంచి తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం దాని సైనిక బలం 200,000 మాత్రమే. రక్షణ అధికారులు ఐదేళ్ల నుంచి సైన్యానికి పరికరాలు కావాలంటూ పదే పదే గుర్తు చేస్తున్నారు. జర్మనీకి యుద్ధ విమానాలు, ట్యాంకులు, హెలికాప్టర్లు, నౌకల కొరత తీవ్రంగా వేదిస్తోంది. జర్మనీ తన గత అనుభవాల దృష్యా బలమైన శాంతికాముక సంప్రదాయాన్నిఅనుసరిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం ఏర్పడుతున్న సమయంలో ఆ దేశానికి ఆయుధాలు పంపాలనే అభ్యర్థనను జర్మనీ పదే పదే తిరస్కరించింది. అయితే జర్మనీ ఉక్రెయిన్‌కు 5,000 హెల్మెట్‌లను మాత్రమే అందించింది. ఇది అపహాస్యం కలిగించింది. అయితే పోలాండ్ ఒత్తిడి వల్ల చివరికి తన నిర్ణయాన్ని మార్చుకుంది. యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపాలని నిర్ణయించింది.