Russia Ukraine Crisis: ‘మళ్లీ చూస్తానో, లేదో కన్నా...’ కూతురితో ఓ సైనికుడి భావోద్వేగం.. వైరల్ వీడియో...

Published : Feb 25, 2022, 12:09 PM IST
Russia Ukraine Crisis: ‘మళ్లీ చూస్తానో, లేదో కన్నా...’ కూతురితో ఓ సైనికుడి భావోద్వేగం.. వైరల్ వీడియో...

సారాంశం

యుద్ధానికి మనసు ఉండదు. తల్లిదండ్రులనుంచి పిల్లల్ని.. పిల్లలనుంచి తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. యుద్ధానికి వెడుతూ తన చిన్నారికి భావోద్వేగభరిత వీడ్కోలు ఇస్తున్న ఓ సైనికుడు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఉక్రెయిన్ : యుద్ధం.. ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తుంది. ఎన్నో కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. అనుబంధాల్ని కాలరాస్తుంది. ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఒక దేశం మరోదేశం మీద చేసే దాడిలో ఎంతోమంది సామాన్యులు బలవుతారు. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోతారు. ఇంకెంతోమంది తల్లిదండ్రులు పిల్లలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తారు.

Russia Ukraine యుద్ధంలోనూ ఇలాంటి హృదయవిదారక ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మీద కాలు దువ్వి.. ఆ దేశం మీద Military actionకు పూనుకుంది. ఇది ఉక్రెయిన్ లోని జనాల్ని భయాందోళనలో పడేసింది. రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం చెబుతున్నప్పటికీ war చేసే నష్టం జరుగుతూనే ఉంది. 

ప్రజలు దేశం నుండి హంగేరి వంటి పొరుగు దేశాలకు పారిపోతున్న విషాద చిత్రాలు వెలుగులోకి వస్తుంది.. అలాంటి ఒక వీడియోలో ఉక్రెయిన్‌లోని Kyivలో ఒక వ్యక్తి తన కూతురుకు వీడ్కోలు చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ భావోద్వేగ వీడ్కోలు చూసిన ప్రతీ ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ సైన్యంలో జవాన్ అయిన ఆ వ్యక్తి యుద్ధానికి వెడుతూ కూతురుకు వీడ్కోలు పలకడం.. ఏడుస్తూ ఆ చిన్నారిని ముద్దాడడం.. వీడియోలో కనిపిస్తుంది. తండ్రిని అలా చూసి.. ఏమీ తెలియని చిన్నారి కూడా కన్నీరుమున్నీరవుతోంది. 

కైవ్ నుండి పౌరుల కోసం ఏర్పాటు చేసిన రెస్క్యూ బస్సులోకి ఎక్కేముందు ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి తన కుమార్తెను గట్టిగా హత్తుుకుని విలపించాడు. ఇలాంటిదే మరో వీడియోలో ఒక ఉక్రేనియన్ సైనికుడు.. “మేం భారీ బాంబు దాడిలో ఉన్నాం.. అమ్మా.. నాన్న.. ఐ లవ్ యూ” అంటూ పంపిన వీడియో హృదయాల్ని మెలిపెడుతోంది. ఆ వీడియోలో ఆ సైనికుడు తన కుటుంబాన్ని మళ్లీ చూడగలనా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాడు.

పశ్చిమ దేశాలు, ఇతర దేశాలు అనేక ఆంక్షలు విధించినప్పటికీ రష్యా గురువారం ఉక్రెయిన్‌పై దాడి చేసింది. రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి పారిపోయి వస్తున్న శరణార్థులను దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. కాగా, ఈ యుద్దం మీద ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ, 27-బ్లాక్ నాటో తన దేశాన్ని గ్లోబల్ బాడీలోకి అనుమతించడానికి భయపడుతుందని అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి