Ukraine Russia crisis కీవ్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు

Published : Feb 25, 2022, 12:04 PM ISTUpdated : Feb 25, 2022, 12:22 PM IST
Ukraine Russia crisis కీవ్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు

సారాంశం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా దళాలు శుక్రవారం నాడు ప్రవేశించాయి.  ఈ విషయమై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ  కోరారు.

కీవ్: Ukrain రాజధాని  kyiv నగరంలోకి Russia దళాలు శుక్రవారం నాడు ప్రవేశించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కీవ్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని Zelensky కోరారు. కర్ఫ్యూ నియమాలు పాటించాలన్నారు. కీవ్ నగరం Aerial threat ముప్పు గురించి జెలెన్ స్కీ హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. మరో 96 గంటల్లో కీవ్ నగరం మొత్తం  రష్యా ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.స్నేక్ ద్వీపాన్ని రష్యా ఆర్మీ హస్తగతం చేసుకొంది.

రష్యా దళాలతో తమ దేశ సైన్యం భీకరంగా పోరాటం చేస్తుందని జెలెన్ స్కీ చెప్పారు. గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.   గురువారం నాడు ఉదయం నుండి రష్యా ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేస్తుంది. జనావాసాలపై కూడా రష్యా దాడులు చేస్తోందని భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు సుమారు లక్ష మంది ప్రజలు పారిపోయారు. 137 మంది మరణించారని జెలెన్ స్కీ  శుక్రవారం నాడు ఉదయం ప్రకటించారు. అంతేకాదు 316 మంది గాయపడ్డారని చెప్పారు.  కీవ్ సమీపంలోని వంతెనను రష్యన్ దళాలు ఉపయోగించకుండా నిరోధించేందుకు వీలుగా పేల్చివేశారు.

ఇదిలా ఉంటే రష్యా తనను లక్ష్యంగా చేసుకొందని  జెలెన్ స్కీ చెప్పారు. తాను రాజధాని  కీవ్ లోనే ఉన్నానని చెప్పారు. తన కుటుంబం కూడా ఉక్రెయిన్ లోనే ఉందని ఆయన వివరించారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్యాపై అమెరికా  ఆంక్షలను విధించింది. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని స్వాధీనం చేసుకొంటామని జో బైడెన్ గురువారం నాడు ప్రకటించారు. 

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను గురువారం నాడు ప్రారంభించింది. కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిష్థితి గురువారం నాడు మిలటరీ ఆపరేషన్ కు దారి తీసింది. 

నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవద్దని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ ను పునరుద్ధాటించారు. మరో వైపు రష్యా  తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని  జెలెన్ స్కీ తెలిపారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.  ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్  తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

నగరాలు, సైనిక స్థావరాలు, వైమానిక దాడుల తర్వాత  కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు  రష్యా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin సమర్ధించుకొన్నారు. గంట గంటకు  ఉక్రెయిన్ పై రష్యా పట్టు సాధిస్తుంది. ఉక్రెయిన్ లోని నగరాలపై  రష్యా దళాలు పట్టు సాధిస్తున్నాయి.  ప్రయత్నిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి