
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UN Security Council) ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే వైఖరి తీసుకోవడానికి గల కారణాలను India వివరించింది. విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలి.. అయితే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇది వదిలివేయబడిందని ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై ఐరాస భద్రతా మండలి భారత్‌కు వివరించింది. యూఎన్‌లో భారతరాయబారి టీఎస్ తిరుమూర్తి (TS Tirumurti) మాట్లాడుతూ..ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాలతో భారతదేశం తీవ్రంగా కలత చెందుతుందన్నారు. హింస, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని తాము కోరుతున్నట్టుగా చెప్పారు.
‘భేదాభిప్రాయాలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు ఒక్కటే సమాధానం. ఈ తరుణంలో భయంకరంగా అనిపించినప్పటికీ.. దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారకరం. చర్చల మార్గాన్ని అనుసరించాలని మేము కోరుతున్నాం. ఈ కారణాల చేత భారత్ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది’ అని తిరుమూర్తి అన్నారు.
ఇక, రష్యా తొలి నుంచి భారత్‌కు మిత్రదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. రష్యాపై సైనిక దాడికి తక్షణం స్వస్తి పలుకాలని కోరారు. ఉక్రెయిన్‌పై హింసకు తెర దించాలన్నారు.
ఇక, భద్రతా మండలిలో ఓటింగ్ అనంతరం UNలోని US రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పనివ్వండి.. రష్యా, మీరు ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు, కానీ మీరు మా గొంతులను వీటో చేయలేరు. మీరు సత్యాన్ని వీటో చేయలేరు. మీరు మా సూత్రాలను వీటో చేయలేరు. మీరు ఉక్రేనియన్ ప్రజలను వీటో చేయలేరు. ప్రస్తుత పరిస్థితిలో మాకు గంభీరమైన బాధ్యత ఉంది.కనీసం అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా దేశాలు కలిసి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మాణాన్ని భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు ఆమోదించాయి. అయితే భారత్, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్ దూరంగా ఉన్నాయి. అయితే యూఎస్‌లో ఐదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. ద్రతా మండలిలో రష్యా విటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటిరి చేశామని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. ఇక, 193 సభ్యదేశాలు ఉన్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.