ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపబోనని పుతిన్ హామీ ఇచ్చాడు: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Feb 6, 2023, 6:35 PM IST
Highlights

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చినట్టు ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయాన్ని తాను జెలెన్‌స్కీకి కూడా తెలియజేశానని వివరించారు. దీనికి అతను నిజమా? అని సందిగ్ధ ప్రశ్న అడిగారని తెలిపారు.
 

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కొద్ది కాలం మధ్యవర్తిగా వ్యవహరించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తొలి నాళ్లలో పలువురు పశ్చిమ దేశాల నేతలు మాస్కోకు సర్‌ప్రైజ్ విజిట్ చేసిన వాళ్లలో బెనెట్ కూడా ఉన్నారు. బెనెట్ దౌత్యం ఈ యుద్ధాన్ని ఆపడంపై కొంతే ప్రభావం చూపినా.. తెర వెనుక జరిగిన దౌత్యంలోని కొన్ని కీలక విషయాలు ఆయన ఇంటర్వ్యూలో బయటపడ్డాయి. ఐదు గంటల ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

దీని ద్వారా మీరేం చేయదలిచారు? జెలెన్‌స్కీని హతమార్చాలని ప్లాన్ చేశారా? అని తాను అడిగానని బెనెట్ పేర్కొన్నారు. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమాధానం ఇచ్చారు. నేను జెలెన్‌స్కీని చంపను అని పుతిన్ సమాధానం ఇచ్చినట్టు బెనెట్ వివరించారు. జెలెన్‌స్కీని మీరు చంపడం లేదని మాట ఇస్తున్నట్టు అర్థం చేసుకోమంటారా? అని మళ్లీ తాను పుతిన్‌ను అడిగారని తెలిపారు. పుతిన్ నుంచి మళ్లీ అదే సమాధానం వచ్చింది. తాను జెలెన్‌స్కీని చంపబోవడం లేదని స్పష్టం చేశారు.

Also Read: ఉక్రెయిన్ యుద్ధానికి ముందే బ్రిటన్ పై క్షిపణి దాడి చేస్తానని పుతిన్ బెదిరించాడు - బోరిస్ జాన్సన్

ఇదే విషయాన్ని తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తెలియజేశానని వివరించారు. ‘లిజన్, నేను మీటింగ్ నుంచి బయటకు వచ్చాను. ఆయన మిమ్మల్ని చంపబోవడం లేదు’ అని జెలెన్‌స్కీకి తెలియజేశాను. నిజమా? ఆర్ యూ షూర్ అని జెలెన్‌స్కీ అడిగాడని వివరించారు. దానికి వంద శాతం ఆయన మిమ్మల్ని చంపరు అని సమాధానం ఇచ్చానని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూ తర్వాత ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన వ్యాఖ్యలపై ఫూల్ కావొద్దు. ఆయన అబద్ధాలు ఆడటంలో నిపుణుడు. ఆయన ఎప్పుడైనా ఏ పనైనా చేయను అని ప్రామిస్ చేశాడంటే.. అది ఆయన ప్లాన్‌లో కచ్చితంగా భాగమై ఉంటుంది’ అని కులేబా పేర్కొన్నారు.

click me!