కిందపడిపోతున్న రాకెట్‌ను హెలికాప్టర్‌తో అందుకున్న రాకెట్ ల్యాబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Published : May 04, 2022, 01:27 PM IST
కిందపడిపోతున్న రాకెట్‌ను హెలికాప్టర్‌తో అందుకున్న రాకెట్ ల్యాబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సారాంశం

రోదసిలోకి శాటిలైట్లను పంపి ఒక దశలో రాకెట్ బూస్టర్ తిరిగి భూ వాతావరణంలోకి పడిపోయాయి. ఆ  రాకెట్‌ను అప్పటికే మోహరించి ఉన్న ప్యారాచూట్లు వేగాన్ని తగ్గించాయి. అనంతరం ఓ హెలికాప్టర్ చాకచక్యంగా ఆ రాకెట్‌ను కేబుల్‌తో పట్టుకుంది. కానీ, గత టెస్టులకు భిన్నంగా దాని బరువు మారడంతో చివరకు ఆ రాకెట్‌ను పసిఫిక్ సముద్రంలో వదిలిపెట్టింది.  

న్యూఢిల్లీ: అంతరిక్షంపై ప్రపంచదేశాలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ తనదైన దారిలో పరిశోధనలు చేస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు అంతరిక్షంలోకి లాంచింగ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాలు పంపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ఈ పనిని చౌకగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక లాంచింగ్ వెహికిల్ శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడానికి సరిపడా వేగాన్ని అందించి ఆ రాకెట్ తిరిగి లాంచింగ్ ప్యాడ్‌కు రావడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగాల్లోనే మునిగితేలుతున్నది. తాజాగా, అదే తీరులో స్పేస్ ఖర్చును తగ్గించే లక్ష్యంతో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన రాకెట్ ల్యాబ్ కీలక ముందడుగు వేసింది. ఉపగ్రహాలను రోదసిలోకి పంపే సమయంలో లాంచింగ్ వెహికిల్ బూస్టర్స్ వేరుపడుతాయన్న సంగతి తెలిసిందే. ఆ రాకెట్‌నే మళ్లీ వినియోగించుకోవాలనే ప్లాన్‌ను వేసింది. ఇందుకోసం భారీ ప్యారాచూట్లతోపాటు హెలికాప్టర్‌నూ గగన వీధుల్లోనే మోహరించింది.

కాలిఫోర్నియాకు చెందిన రాకెట్ ల్యాబ్ అనే చిన్న సంస్థ 34 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి చేర్చడానికి న్యూజిలాండ్‌ నుంచి ఆకాశంలోకి పంపారు. ఆ రాకెట్ ఉపగ్రహాలను ఆకాశంలోకి తీసుకెళ్లింది. నాలుగు అంతస్తుల ఎత్తున్న రాకెట్ బూస్టర్ స్టేజ్‌లో భూ వాతావరణంలోనే వెనక్కి పడింది. శాటిలైట్లకు నిర్ణీత వేగాన్ని అందించి ఆ దశలో రాకెట్ వేరుపడింది. ఆ రాకెట్ మళ్లీ భూమి వైపుగా దూసుకువచ్చింది. ఆ రాకెట్ వేగాన్ని నియంత్రించడానికి కొన్ని ప్యారాచూట్లు ఉన్నాయి.

కాగా, ఆ రాకెట్‌ను మళ్లీ లాంచింగ్ ప్యాడ్ దగ్గరకు తీసుకురావడానికి న్యూజిలాండ్ దక్షిణ పసిఫిక్ తీరంపైన ఓ హెలికాప్టర్ మోహరించి ఉన్నది. ఆ ప్యారాచూట్లు కిందకు రాగానే హెలికాప్టర్ ఆ రాకెట్ ‘క్యాప్చర్ లైన్’ను అందుకుంది. దీంతో రాకెట్ ల్యాబ్ కార్యాలయంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అప్పుడు ప్యారాచూట్లతో ఉన్న రాకెట్ సుమారు గంటకు 35 కిలోమీటర్ల చొప్పున కిందపడుతున్నది. ఈ ఘట్టాన్ని మొత్తం కంపెనీ లైవ్ స్ట్రీమ్‌లో వీక్షణకు అందుబాటులో ఉంచింది.

అయితే, ఆ శాస్త్రజ్ఞుల సంబురాలు ఎంతో కాలం నిలవలేవు. ఆ హెలికాప్టర్ రాకెట్‌ను నియంత్రించి మళ్లీ గ్రౌండ్‌పైకి తేలేకపోయింది. దాన్ని పసిఫిక్ సముద్రం వైపుగా తీసుకెళ్లింది. ఆ రాకెట్ పసిఫిక్ సముద్రంలో మునిగింది. గత టెస్టులకు భిన్నంగా రాకెట్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉన్నాయని, అందుకే తాము ఆ రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ వద్దకు తేలేకపోయామని పైలట్లు పేర్కొన్నారు.

రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ ట్విట్టర్‌తో నో బిగ్ డీల్ అని రాసుకొచ్చాడు. ఆ రాకెట్ సురక్షితంగానే సముద్రంలో మునిగిందని, దాన్ని ఇప్పుడు షిప్‌లో లోడ్ చేస్తున్నట్టు వివరించాడు. అయితే, అదే బూస్టర్‌ను రాకెట్ ల్యాబ్ మళ్లీ వినియోగించనుందా? అనే విషయంపై క్లారిటీ లేదు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే