Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం: రాజపక్సే ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం !

Published : May 04, 2022, 12:03 PM IST
Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం: రాజపక్సే ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం !

సారాంశం

Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి బాధ్యత వహిస్తున్న రాజపక్సే, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనల కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే  రాజపక్సే ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీలు సిద్ధ‌మయ్యాయి.  

Sri Lanka economic crisis: శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. ప్రధానమంత్రి మహింద రాజపక్స, అతని క్యాబినెట్‌ను గద్దె దించడమే లక్ష్యంగా అవిశ్వాస తీర్మాన ప్రకటనను విడుదల చేసింది. శ్రీలంకకు చెందిన ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంట్‌లో ఎస్‌ఎల్‌పీపీ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీనికి అనుగుణంగా బుధ‌వారం లేదా ఆ త‌ర్వాతి రోజు ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశ‌ముంది. శ్రీలంక ప్ర‌స్తుతం ఘోర‌మైన‌ ఆర్థిక సంక్షోభం మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు దేశ‌వ్యాప్తంగా పెద్దఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగారు. రోజురోజుకూ ప్ర‌భుత్వంపై ప్ర‌జాగ్ర‌హం అధికం అవుతోంది. దేశం ఎదుర్కొంటున్న ఈ దుర్భ‌ర ప‌రిస్థితికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. 

ప్రధాన ప్రతిపక్షం సామగి జన బల్వేగయ (ఎస్‌జేబీ), ప్రధాన తమిళ పార్టీ, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) సంయుక్తంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నాయి. నాయకుడు సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ పార్టీకి చెందిన ఒక బృందం మంగళవారం పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనాకు అవిశ్వాస పార్లమెంట్ ఓటింగ్‌ను డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని అందించింది. ఆర్థిక సంక్షోభానికి బాధ్యత వహిస్తున్న రాజపక్సే, అతని తమ్ముడు, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొన‌సాగుతున్న క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.  రాజపక్సే,  అత‌ని మంత్రివర్గాన్ని అధికారం నుండి తొలగించడానికి 225 మంది సభ్యుల పార్లమెంటులో మెజారిటీ ఓటు అవసరం. యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ కేవలం 54 ఓట్లను మాత్రమే క‌లిగివుంది. కానీ ఇత‌ర చిన్న ప్రతిపక్ష పార్టీల ఓట్లతో పాటు సంకీర్ణ ప్ర‌భుత్వంలో కొన‌సాగుతున్న అధికార శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నుండి ఫిరాయింపుల మ‌ద్ద‌తును కూడా ఉంటుంద‌ని  భావిస్తోంది.

ఇక అధికార పార్టీకి దాదాపు 150 ఓట్లు ఉన్నాయి. అయితే ఆర్థిక సంక్షోభం.. అవిశ్వాసంలో ఫిరాయింపుల మధ్య ఆ బలం క్షీణించింది. బుధవారం నుంచి పార్లమెంటు సభ్యుల సమావేశం ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానం ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ కూడా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, అయితే మెజారిటీ చట్టసభ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ పదవిని వ‌దులుకోవ‌డానికి అది  బలవంతం చేయదు. కాగా, శ్రీలంక తన విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత శ్రీలంక దివాలా అంచుకు జారుకుంది.  దేశం 2026 నాటికి చెల్లించాల్సిన USD 25 బిలియన్లలో ఈ సంవత్సరం USD 7 బిలియన్ల విదేశీ రుణాల చెల్లింపులను ఎదుర్కొంటుంది. శ్రీలంక విదేశీ నిల్వలలో USD 1 బిలియన్ కంటే తక్కువగా నిల్వ‌లు ఉన్నాయి. విదేశీ కరెన్సీ సంక్షోభం దిగుమతులను పరిమితం చేసింది. దీంతో ఇంధనం, వంటగ్యాస్, మందులు, ఆహారం వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు తాము చేయగలిగిన వాటిని కొనడానికి గంటల తరబడి పెద్ద వరుసలలో ఉండాల్సిన ప‌రిస్థితి దాపురించింది. వాటి ధ‌ర‌లు సైతం రికార్డుల మోత మోగిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే