చెస్ ఆడుతుండగా.. బాలుడి వేలు విరగొట్టిన రోబో..!

Published : Jul 26, 2022, 10:26 AM IST
చెస్ ఆడుతుండగా.. బాలుడి వేలు విరగొట్టిన రోబో..!

సారాంశం

చెస్ ఆడుతుండగా రోబో బాలుడి వేలు విరిచేసింది. ఈ సంఘటన రష్యా రాజధాని మాస్కోలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ రోజుల్లో ప్రతి పని చేయడానికి రోబో కనిపెడుతున్నారు. చాలా మంది ఇళ్లల్లో ఇప్పుడు రోబోటిక్ మెషిన్స్ కూడా ఉంటున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే..  చెస్ ఆడటంలో నైపుణ్యంగల ఓ రోబోని తయారు చేశారు. ఆ రోబో తో ఏడేళ్ల బాలుడు చెస్ ఆడటం మొదలుపెట్టాడు. చాలా ఆసక్తికరంగా సాగిన వీరిద్దరి మధ్య చెస్ పోటీలో.. ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెస్ ఆడుతుండగా రోబో బాలుడి వేలు విరిచేసింది. ఈ సంఘటన రష్యా రాజధాని మాస్కోలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

క్రిస్టోఫర్ అనే ఏడేళ్ల బాలుడు రోబోతో చెస్ ఆడేందుకు పోటీ పడ్డాడు. ఆటలో భాగంగా బాలుడు రోబోపై ఎత్తుకు పై ఎత్తు వేస్తుండగా...రోబో హఠాత్తుగా స్పందించిది. బాలుడి వేలును గట్టిగా విరిచేసింది. ఆ నొప్పి తట్టుకోలేక బాలుడు గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపులు విని పక్కనే ఉన్న ముగ్గురు బాలుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు.

 

వారు రోబో నుంచి బాలుడి వేలు బయటకు తీసేందుకు చాలా ఎక్కువగానే కష్టపడ్డారు.  ఆ తర్వాత చాలా తిప్పలు పడి బాలుడిని విడిపించారు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు కట్టుకట్టారు. బాలుడి చేతికి తీవ్రంగా గాయమైందని వైద్యులు తెలిపారు.

కాగా.. ఈ సంఘటనపై రష్యా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెర్గీ స్మాగిన్  స్పందించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. బాలుడు నిబంధనలకు విరుద్దంగా ఆడటం వల్లే రోబో అలా స్పందించిందని ఆయన చెప్పారు. రోబోకు సమయం ఇవ్వకుండా బాలుడు చాలా ఫాస్ట్ గా పావులను కదిలించాడని.. అందుకే రోబో అలా చేసిందని ఆయన చెప్పడం గమనార్హం.

కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం. రోబోతో బాలుడిని గేమ్ ఆడించిన నిపుణులపై  నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి