కెనడాలో సామూహిక కాల్పులు.. భార‌త సంతతికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి..

Published : Jul 26, 2022, 09:57 AM IST
కెనడాలో సామూహిక కాల్పులు.. భార‌త సంతతికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి..

సారాంశం

కెనడాలో ఓ దుండగుడు సామూహిక కాల్పులకు ఒడిగట్టాడు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరెంతో మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం నిందుతుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

కెనడాలోని వాంకోవర్ సోమ‌వారం తెల్ల‌వారుజామున ఓ దుండ‌గుడు దారుణానికి ఒడిగ‌ట్టాడు. సామూహికంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఇంకా మ‌రింత చ‌నిపోయే అవ‌కాశం ఉంద‌ని వార్తా సంస్థ IANS నివేదించింది. మృతి చెందిన వారిని మెనిందర్ ధాలివాల్, సతీందేరా గిల్ గా గుర్తించారు.

యమధర్మరాజుకు రోడ్ల లీజ్.. బెంగళూరులో వినూత్న నిరసన...

ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలిపింది. అయితే వాంకోవర్‌కు ఆగ్నేయంగా గంట దూరంలో 130,000 మంది జనాభా ఉన్న లాంగ్లీలో కాల్పులు జరిగింది. ఈ న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి దూరంగా ఉండాలని నివాసితులను కోరారు. ఈ మేర‌కు లాంగ్లీ పోలీసులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

క్రిమినల్ లాను వేధింపుల సాధనంగా ఉపయోగించకూడదు - మహ్మద్ జుబేర్ కేసులో సుప్రీంకోర్టు

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) సార్జెంట్ రెబెక్కా పార్స్ లో ఏవైనా మరణాలు సంభవించాయా అనే దానిపై వ్యాఖ్యానించలేదు. కానీ పోలీసులు లోయర్ మెయిన్ ల్యాండ్ ప్రధాన నేరాలు, ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ నుంచి పరిశోధకులను తీసుకువస్తున్నారని చెప్పారు. ‘‘లాంగ్లీ నగరంలోని డౌన్ టౌన్ కోర్ లో అనేక షూటింగ్ దృశ్యాలు, లాంగ్లీ టౌన్ షిప్ లో 1 పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది ’’ అని బీసీ నివాసితుల ఫోన్లకు పంపిన హెచ్చరికలో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో చాలా మంది చనిపోయారని RCMP తెలిపార‌ని కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) పేర్కొంది. అయితే ఎంత మంది చ‌నిపోయార‌నేది చెప్ప‌లేదు. నిరాశ్రయులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జ‌రిగిన‌ట్టు పోలీసులు భావిస్తున్నార‌ని CBC తెలిపింది. 

కెనడాలోని అన్ని హింసాత్మక నేరాలు పెరుగుతున్నాయి. అయితే ఇందులో చాలా కింద‌ట వ‌ర‌కు మూడు శాతం కంటే త‌క్కువ‌గా తుపాకీ వ‌ల్ల జ‌రిగిన దాడులు ఉండేవి. కానీ 2009 నుండి తుపాకీ కాల్పుల త‌ల‌స‌రి రేటు ఐదు రేట్లు పెరిగింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు నిరోదించ‌డానికి ఈ దేశానికి పొరుగున ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో ఇటీవ‌లే ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హ్యాండ్ గ‌న్ మేనేజ్ మెంట్ పై ప్రతిపాదిత స్తంభనను ప్రకటించారు. దీని వ‌ల్ల వాటి దిగుమతి, విక్రయాలను స‌మ‌ర్థవంతంగా నిషేధంలోకి వ‌స్తాయి. 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి