బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్:వివాదాలకు కొత్తేం కాదు

Published : Oct 24, 2022, 10:02 PM IST
బ్రిటన్  ప్రధానిగా  రిషి సునాక్:వివాదాలకు కొత్తేం కాదు

సారాంశం

యూకే  ప్రధాని రిషి  సునాక్ కు వివాదాలు కొత్తేం కాదు .గతంలో ఆయన చేసిన  వ్యాఖ్యలు  వివాదాస్పదంగా మారాయి. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు గుప్పించారు. 

లండన్:బ్రిటన్  ప్రధానిగా  రిషి సునాక్  ఏకగీవ్రంగా  ఎన్నికయ్యారు. బ్రిటన్ ప్రధాని  పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి సునాక్ కు ప్రధానిగా  పోటీకి అవకాశం  వచ్చింది.రిషి సునాక్ కు  వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు  కారణమయ్యాయి.


యూకే  గొప్ప దేశం ,ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో దేశం కూరుకుపోయిందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతానని  ఆయన ఆదివారంనాడు ట్వీట్  చేశారు. యూకే  ప్రధాని పదవికి ట్రస్  రాజీనామా చేసిన తర్వాత  ప్రధాని పదవికి పోటీ  చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు తాను  చేయబోయే  ఎజెండాను ట్విట్టర్  వేదికగా  ప్రకటించారు. అయితే మోర్టాండో  ప్రధాని పదవికి  నామినేషన్ ఉపసంహరించుకోవడంతో  బ్రిటన్ ప్రధానిగా  రిషి సునాక్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు.

గతంలో  రిషి సునాక్  చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  చోటు  చేసుకున్న వివాదాలు ఇలా ఉన్నాయి.

నో వర్కింగ్ క్లాస్  ఫ్రెండ్స్

మిడిల్ క్లాసెస్ తేర్ రైజ్ స్ప్రాల్ అనే బీబీసీ  డాక్యుమెంటరీ  సిరిస్ లో  రిషి సునాక్ తన స్నేహితుల గురించి వివరించారు .2001లో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. తనకు ఉన్నత వర్గానికి చెందిన స్నేహితులున్నారన్నారు .వర్కింగ్ క్లాస్ ప్రెండ్స్ లేరని  చెప్పారు.ఈ వీడియో క్లిప్ ను ఆయన వైరి వర్గం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం కోసం ఉపయోగించుకుంది. 

రిషి సునాక్ భార్య నాన్ డొమిసైల్ స్టేటస్ 

రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్ లో  నివసిస్తున్నారు. ఇన్సోసిస్  సహ వ్యవస్థాపకుడు  నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని  రిషి  సునాక్  వివాహం  చేసుకున్నారు.నాన్ డొమిసైల్  హోదా  కారణంగా బ్రిటన్ లో  నివసిస్తున్నవారు ఇతర దేశాల్లో ఆర్జిస్తున్నఆదాయానికి పన్నుకట్టాల్సిన అవసరం లేదు..నాన్ డొమిసైల్ హోదాను అడ్డుపెట్టుకొని అక్షతమూర్తి పన్ను  ఎగవేస్తున్నారని  విపక్షాలు ఆయనపై విమర్శలు చేశాయి. ఈ విమర్శల  నేపథ్యంలో  అక్షతా  మూర్తి నాన్ డోమిసైల్  హోదాను వదులుకున్నారు.

రష్యన్ బ్లడ్  మనీ
ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత సునాక్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. షెల్ ,బీపీ వంటి కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడం మానేయాలని కోరారు. కానీ  రష్యాలో కార్యకలాపాలను  నిలిపివేయడానికి ఇన్సో సిస్  సంస్థ  నిరాకరించింది.  ఇన్పోసిస్ డివిడెంట్లలో మనీ వసూలు చేసినట్టుగా  అక్షతామూర్తిపై ఆరోపణలున్నాయి.

బ్రెడ్ వివాదం

బీబీసీ బ్రేక్ ఫాస్ట్  షో లో సునాక్ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి.  యూకేలో బ్రెడ్ ధర పెరగడం గురించి  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాను, తన భార్య, పిల్లలకు రకరకాల బ్రెడ్లున్నాయని చెప్పారు.  చాలా మందికి ఒక్కబ్రెడ్ దొరకడమే కష్టంగా ఉన్న  పరిస్థితుల్లో సునాక్ ఇంట్లో మాత్రం రకరకాల బ్రెడ్లు ఉన్నాయని  ఆయన  చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్ధులు విమర్శలు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..