David Cameron :రిషి సునక్ కేబినెట్ లో యూకే మాజీ ప్రధానికి చోటు.. విదేశాంగ కార్యదర్శిగా డేవిడ్ కామెరూన్ నియామకం

Published : Nov 13, 2023, 04:40 PM IST
David Cameron :రిషి సునక్ కేబినెట్ లో యూకే మాజీ ప్రధానికి చోటు.. విదేశాంగ కార్యదర్శిగా డేవిడ్ కామెరూన్ నియామకం

సారాంశం

David Cameron : బ్రిటన్ కు గతంలో ప్రధానిగా డేవిడ్ కామెరూన్ ప్రస్తుత ప్రధాని రిషి సునక్ మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని రిషి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కింగ్ చార్లెస్ కూడా ఆమోదం తెలిపారు.

David Cameron : బ్రిటన్ లో ప్రధాని రిషి సునక్ తన కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించారు. అందులో మాజీ ప్రధాని  డేవిడ్ కామెరూన్ కు చోటు కల్పించారు. ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు. హోం కార్యదర్శిగా ఉన్న స్యూయెల్లా బ్రేవర్మన్ తొలగించి, ఆమె స్థానంలో జేమ్స్ క్లెవర్లీని నియమించిన తరువాత అనూహ్యంగా ఈ నియామకం జరిగిందని ‘స్కై న్యూస్’ నివేదించింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

వాస్తవానికి కామెరాన్ యూకే పార్లమెంటుకు ఎన్నిక కాలేదు. అయితే భారత సంతతికి చెందిన విదేశాంగ కార్యదర్శి స్యూయెల్లా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాసం రాసిన తర్వాత చెలరేగిన వివాదం నేపథ్యంలో జరిగిన ప్రధాన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన నియామకాన్ని సునక్ ప్రభుత్వం ఆమోదించింది. పాలస్తీనా అనుకూల పక్షపాతంతో లండన్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బ్రేవర్‌మాన్ రాసిన కథనంపై రోజుల తరబడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య జరిగింది.

అయితే మొదట్లో సునక్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో గత గురువారం ఆయన కార్యాలయం ప్రకటనను కూడా విడుదల చేసింది. అందులో ఆమెపై ప్రధానికి విశ్వాసం ఉందని ప్రకటన తెలిపింది. కానీ ఆమె వ్యాఖ్యలను రిషి ఆమోదించలేదు. కాగా.. తాజాగా నియామకం నేపథ్యంలో రిషి సునక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బ్రిటన్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కామెరాన్ కు సీటు ఇవ్వడానికి కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు. విదేశీ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శిగా కామెరాన్ నియామకాన్ని కూడా కింగ్ ఆమోదించారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?