Rishi Sunak Resign: బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి సాజిద్ జావేద్ కూడా రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాస్తూ.. సునక్ రాజీనామా చేశారు. లేఖలో, బోరిస్ జాన్సన్ పని చేసే విధానాన్ని సునక్ ప్రశ్నించారు. రిషి సునక్ తన రాజీనామా గురించి ట్విట్టర్‌లో పేర్కొంటూ.. బోరిస్ జాన్సన్‌కు లేఖ కూడా రాశారు. ఈ లేఖలో, అతను జాన్సన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వాన్ని సక్రమంగా, సీరియస్‌గా, సమర్ధవంతంగా నడపాలని ప్రజలు ఆశిస్తున్నారని, అయితే.. అలా వ్యవహరించడంతో చాలాసార్లు విఫలమైందని అన్నారు. అలా జరగడం లేదన్నారు. మంత్రిగా ఇది తన చివరి ఉద్యోగం కావచ్చునని అన్నారు. కానీ ప్రభుత్వంలో మెరుగైన ప్రమాణాల కోసం పోరాడం చేస్తాననీ, ప్రధాన మంత్రి బోరిస్ మంత్రివర్గం నుండి తాను రాజీనామా చేయడానికి కారణం ఇదేనని తెలిపారు.
ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్తపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆ ఆరోపణలను నిరాకరించిన తరువాత సునక్ చివరకు తన పదవీకి రాజీనామా చేశాడు. రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాల్లో అక్షతా మూర్తి భాగస్వామి అని, UKలో పన్ను చెల్లించడం లేదని రిషి సునక్, అక్షతా మూర్తిని పక్కన పెట్టారు. మరోవైపు.. ఈ గందరగోళాల కారణంగా తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయనని రిషి సునక్ స్పష్టం చేశారు.
సమీక్ష జరపాలని డిమాండ్
తనపై వస్తున్న ఆరోపణలపై రిషి సునక్ గతంలో కూడా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంత్రివర్గ ప్రకటనల నిబంధనలను తాను పాటించాలా వద్దా అని సమీక్షించాలని ఆ లేఖలో ఆయన ప్రధానిని కోరారు. ఇటీవల సునక్ పెట్టిన ట్విట్టర్‌లో.. ఎల్లప్పుడూ నిబంధనలను అనుసరిస్తాననీ, తమ ఆర్థిక వ్యవహరాలపై సమీక్ష నిర్వహించాలనీ, దీంతో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
ఋషి సునక్ భార్య నారాయణ మూర్తి కుమార్తె
రిషి సునక్ భార్య అక్షతా మూర్తి.. ఈమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. వివాదం తర్వాత.. అక్షత తన భర్త పనిలో అంతరాయం కలగకుండా ఉండటానికి తన ఆదాయంపై UKలో పన్ను చెల్లిస్తానని ప్రకటించింది. తన గ్లోబల్ ఆదాయంపై UKలో పన్ను చెల్లించాలనే నిర్ణయం భారతదేశం పుట్టిన ప్రదేశం, పౌరసత్వం, తల్లిదండ్రుల ఇల్లు, నివాస స్థలం అనే వాస్తవాన్ని మార్చదని అక్షత ట్వీట్ చేసింది, కానీ, ఆమె బ్రిటన్‌ను కూడా ప్రేమిస్తున్నాననీ ప్రకటించారు. .
భారత జాతీయురాలైన ఆర్థిక మంత్రి భార్య పన్ను చెల్లింపుల నిమిత్తం బ్రిటన్‌లో నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది. దీనర్థం ఆమె తన విదేశీ ఆదాయాలపై పన్ను చెల్లించడానికి చట్టబద్ధంగా బాధ్యత వహించలేదు. ఈ విషయం వెల్లడి తరువాత.. విపక్ష పార్టీలు ద్వంద్వ వైఖరిని కలిగి ఉన్నాయని ఆరోపించాయి. భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి ఇటీవల పన్ను ఎగవేశారనీ, ఆయన కుటుంబానికి గణనీయమైన ఆదా చేయబడిందని విపక్షాలు ఆరోపించాయి.