మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏ దేశానిదో తెలుసా..?

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 11:19 AM IST
Highlights

మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఉపయోగిస్తాం.. ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటుంది.. కానీ వీసా మాత్రం దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది

మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఉపయోగిస్తాం.. ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటుంది.. కానీ వీసా మాత్రం దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది.. ఎన్ని దేశాలు తిరిగితే అన్ని దేశాలు మనకు వీసా మంజూరు చేయాలి.. ఆయా దేశాల కాన్సులేట్ కార్యాలయాల్లో డబ్బు కట్టి దరఖాస్తు చేసుకుని అవసరమైతే ఇంటర్వ్యూ.. ఆపై ప్రాసెసింగ్ పూర్తయితేనే వీసా వస్తుంది.

అయితే వీసా అవసరమే లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తోనే విదేశాలకు వెళ్లొచ్చు.. ఇలాంటి వాటిలో మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు జపాన్‌ది. పాస్‌పోర్ట్‌కు పవరేంటి అనుకుంటున్నారా..? ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం ఉండదో దానిని మోస్ట్ పవర్ ఫుల్‌గా పరిగణిస్తారు..

ప్రస్తుతం జపాన్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఈ దేశం యొక్క పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు.. ఇటీవలే మయన్మార్‌కు కూడా వీసా లేకుండా వెళ్ళే గుర్తింపు లభించింది.

జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు వీసా లేకుండా కానీ.. ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలో వీసా పొందే అవకాశం ఉంది.. మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ రెండోస్థానంలో, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికాలు మూడో స్థానంలో, అమెరికా, బ్రిటన్‌లు ఐదవ స్థానంలో ఉన్నాయి.

ఇక భారత్ విషయానికి వస్తే వీసా లేకుండా మనం 59 దేశాలకు వెళ్లొచ్చు. ర్యాంకింగ్  పరంగా మన స్థానం 76. ఒక దేశం మరో దేశంతో కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వీసా లేకుండానే ఆయా దేశాల్లో పర్యటించవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇవ్వబడ్డాయి.
 

click me!