
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పీవోకేలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ముజఫరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయనను అక్కడి ప్రజలు ‘‘గో బ్యాక్ నాజీ’’ అంటూ స్వాగతం పలికడంతో పాటు ‘‘కశ్మీర్ హిందూస్తాన్‌దే’’నంటూ నినాదాలు చేశారు.
అంతముందు కాశ్మీర్ విషయంలో తమకు అంతర్జాతీయ మద్ధతు లభించలేదన్న విషయాన్ని ఇమ్రాన్ అంగీకరించారు. కాశ్మీర్‌ను భారత్ తనలో కలిపేసుకుందని.. ఇక భారతదేశం దృష్టిలో అది ఏమాత్రం వివాదాస్పద భూమి కాదన్నారు.
ప్రపంచ దేశాలు కాశ్మీర్ అంశంపై స్పందిస్తాయని తాను భావించానని.. అయితే అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు కూడగట్టడంలో తాము విఫలమయ్యామని ఇమ్రాన్ ఓ రష్యా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.