బోని గ్యాబ్రియల్ కి మిస్ యూనివర్స్ 2022 టైటిల్ : టాప్ 16లో నిలిచిన ఇండియాకు చెందిన దివితా రాయ్

By narsimha lodeFirst Published Jan 15, 2023, 10:19 AM IST
Highlights

అమెరికాకు చెందిన  బోని గ్యాబ్రియల్  మిస్ యూనివర్స్  2022 టైటిల్ ను గెలుచుకున్నారు.  

వాషింగ్టన్: అమెరికాకు చెందిన బోని గ్యాబ్రియల్  మిస్ యూనివర్స్  2022 టైటిల్ ను గెలుచుకుంది.  మిస్ యూనివర్స్  2021 టైటిల్ ను  హర్నాజ్  సంధుచే  దివా  గెలుచుకుంది.  ఈ నెల  15న అమెరికాలో  మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి.  మిస్ డొమినికన్ రిపబ్లిక్ గా ఆండ్రీనా మార్టినెజ్  రెండో రన్నరప్ గా  నిలిచారు.  మిస్ వెనిజులా   అమండా  డుడామెల్ మొదటి రన్నరప్ గా  నిలిచారు.  ఇండియాకు  చెందిన దివితా రాయ్ టాప్  16 లో  నిలిచారు. 

28 ఏళ్ల గ్యాబ్రియల్  టెక్సాస్ లోని  హుస్టన్  కు చెందిన  ఫ్యాషన్ డిజైనర్.  ఆమె తల్లి  అమెరికన్,  తండ్రి ఫిలిఫినో. తొలి  మూడు ప్రశ్నల రౌండ్ లో  గ్యాబ్రియెల్ లో  ఫ్యాషన్ ను మంచి శక్తిగా  ఉపయోగించడం కోసం ఆమె మాట్లాడారు. తాను తన దుస్తులను  తయారు చేసే సమయంలో  రీ సైకిల్ చేసిన  పదార్ధాల  ద్వారా  కాలుష్యాన్ని తగ్గిస్తున్నట్టుగా  ఆమె చెప్పారు. 80 మందికిపైగా అందాల భామలు  ఈ టైటిల్ కోసం  పోటీ పడ్డారు.  భారత క్రీడాకారిణి  దివితా రాయ్  టాప్  16కే పరిమితమైంది.  ఆమె టాప్ -5 లో చోటు దక్కించుకోలేకపోయింది. 

ఇండియాకు  చెందిన లారా దత్తా,  సుస్మితా సేన్ తర్వాత  మిస్ యూనివర్స్ కిరీటాన్ని  హర్నాజ్ సంధు దక్కించుకున్నారు. 71 వ మిస్ యూనివర్స్ పోటీని  2022 డిసెంబర్ లో నిర్వహించాలని భావించారు. కానీ  ఫీఫా ప్రచంచకప్ పోటీల నేపథ్యంలో  ఈ పోటీలను  ఈ ఏడాది జనవరి మాసంలో నిర్వహించారు. మారుతున్న  కాలానికి  అనుగుణంగా  మిస్ యూనివర్స్  పోటీలకు  వివాహిత మహిళలు, తల్లులను  కూడా  అనుమతిస్తున్నారు. 

click me!