క్వీన్ ఎలిజబెత్ II మరణానికి అసలు కారణమదేనా..? తెర మీదకి వచ్చిన కొత్త వాదన 

By Rajesh KarampooriFirst Published Nov 26, 2022, 2:15 PM IST
Highlights

బ్రిటన్ కి అత్యథిక కాలం రాణిగా వ్యవహరించారు క్వీన్ ఎలిజబెత్2.. 96 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లో మరణించారు. అయితే.. ఆమె చనిపోయే ముందు ఆమె క్యాన్సర్ తో పోరాడినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ స్నేహితుడు గైల్స్ బ్రాండ్రెత్ రాసిన న్యూ బయోగ్రాఫీ'ఎలిజబెత్: యాన్ ఇంటిమేట్ పోర్ట్రెయిట్'లో క్వీన్ ఎలిజబెత్ ఓ రకమైన బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్‌)తో పోరాడారని పేర్కొన్నారు.
 

బ్రిటన్‌లో సుదీర్ఘకాలం పాలించిన రాణి క్వీన్ ఎలిజబెత్ II తన 96 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లో మరణించిన విషయం తెలిసిందే.. అయితే.. చనిపోవడానికి ముందు ఆమె తన చివరి రోజులలో క్యాన్సర్‌తో పోరాడినట్టు తెలుస్తోంది. బ్రిటన్  ప్రిన్స్ ఫిలిప్ స్నేహితుడు గైల్స్ బ్రాండ్రెత్ రాసిన న్యూ బయోగ్రాఫీ'ఎలిజబెత్: యాన్ ఇంటిమేట్ పోర్ట్రెయిట్' అనే పుస్తకంలో సంచనల వ్యాఖ్యలు చేశారు. క్వీన్ ఎలిజబెత్  తన చివరి రోజుల్లో ఎముక మజ్జ క్యాన్సర్‌తో పోరాడారని తన పుస్తకంలో వెల్లడించారు. అయితే.. మహారాణి మరణానికి ప్రధాన కారణం వృద్ధాప్యమేనని అధికారికంగా ప్రకటించారు.  

" మహారాణికి మైలోమా - బోన్ మ్యారో అనే క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె త్వరగా అలసటకు గురి కావడం, బరువు తగ్గడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడిందని పేర్కొన్నారు.  ఆమె తన జీవితంలోని చివరి రోజుల్లో తరుచుగా మొబిలిటీ సమస్యలతో పడపడినట్టు తాను స్వయంగా విన్నానని బ్రాండ్రెత్ రాశారు. రాణి తన జీవితంలోని చివరి కాలంలో తరచుగా చలనశీలత సమస్యలను ఎదుర్కొంటుంది, బహిరంగ ప్రదేశాల్లో క్రమం తప్పకుండా వాకింగ్ స్టిక్‌ను ఉపయోగించేది. దీంతో పలు అధికారిక విధుల నుండి వైదొలిగింది. మైలోమా క్యాన్సర్ ..అత్యంత లక్షణం ఎముకల నొప్పి, ముఖ్యంగా కటి, దిగువ వీపులో నొప్పితో బాధపడుతారు. మల్టిపుల్ మైలోమా అనేది ప్రధానంగా వృద్ధులను ప్రభావితం చేసే వ్యాధి. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రిన్స్ ఫిలిప్ మరణించిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ .. మానసికంగా చాలా బలహీనతకు గురయ్యారని అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. 

25 ఏళ్లకే రాణి  

క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్‌లో మరణించింది. వేసవి సెలవుల్లో ఆమె ఇక్కడికి వచ్చింది. వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఎలిజబెత్ తన తండ్రి జార్జ్ VI మరణం తర్వాత 1952లో ఆమె రాణి అయింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలే.. ఆమె బ్రిటన్ ను దాదాపు 70 సంవత్సరాలు పాలించింది.  క్వీన్ ఎలిజబెత్ 1926 ఏప్రిల్ 21న జన్మించారు. ఆ సమయంలో బ్రిటన్‌లో కింగ్ జార్జ్ V పాలన ఉంది. ఎలిజబెత్ తండ్రి, కింగ్ జార్జ్ VI కూడా తర్వాత బ్రిటన్ రాజు అయ్యాడు. క్వీన్ ఎలిజబెత్ పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్.

click me!