మెట్లపై నుంచి జారిపడ్డ పుతిన్‌.. క్షీణించిన ఆరోగ్యం..

By Rajesh KarampooriFirst Published Dec 4, 2022, 11:16 PM IST
Highlights

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో పడిపోయారని, దాని కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని న్యూయార్క్ పోస్ట్ అనే వార్తా సంస్థ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యానికి  సంబంధించిన మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుండి జారిపడిపోయారని, దాని కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని న్యూయార్క్ పోస్ట్ అనే వార్తా సంస్థ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపింది. ఈ ఛానల్ కథనం ప్రకారం.. 70 ఏళ్ల పుతిన్ పడిపోయిన కారణంగా అతని వెన్నుకు తీవ్ర గాయాలు అయ్యాయి, ఇప్పటికే కడుపు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రమాదం సమయంలో అసంకల్పిత మలవిసర్జన చేసుకున్నాడని, ఆ తర్వాత అతడిని తన పర్సనల్ గార్డ్స్ పైకి లేపి, క్లీన్ చేసిన తర్వాత చికిత్సకు తరలించినట్టు తన కథనంలో పేర్కొంది. 

మరో మీడియా కథనం ప్రకారం.. వైద్యుల పరీక్షల్లో పుతిన్ కు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదనీ, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. కానీ.. అతనికి కాస్త విశ్రాంతి అవసరమని, త్వరలోనే అతను తనంతట తానుగా నడవగలడని నివేదికలో వెల్లడించింది. అయితే.. వెన్నెముక దిగువ కోకిక్స్ భాగంలో నొప్పి కారణంగా, అతను కూర్చోవడం కష్టం. వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు.  

ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు  పేర్కోంటున్నాయి. ఇటీవల క్యూబా నేతతో జరిగిన సమావేశంలో పుతిన్ కుర్చీని గట్టిగా పట్టుకుని కనిపించారనీ, ఈ సమయంలో..అతని చేతుల రంగులో మార్పు కనిపించిందనీ, ఈ సమయంలో పుతిన్  అసౌకర్యంగా కాళ్లు కదుపుతున్నట్లు కనిపించిందని UK ఆధారిత ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనల ద్వారా పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వార్తా సంస్థ పేర్కొంది. అదే నివేదికలో పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉక్రెయిన్‌పై దాడి చేశాడని బ్రిటీష్ గూఢచారి ఓ ప్రకటన లో వెల్లడించారు. 

పుతిన్‌కి బ్లడ్ క్యాన్సర్ ఉందా?

పుతిన్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు,  దాని కారణంగా అతని జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమవుతుందని అప్పట్లో పలు నివేదికలో పేర్కొన్నారు.  ఆయన గత కొన్ని నెలలుగా మద్యనిషేధం పాటిస్తున్నారు. పుతిన్ కడుపునొప్పి, భయము, దగ్గు, పార్కిన్సన్స్ లక్షణాలను చూసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దాదాపు 10 నెలల క్రితం ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా "ప్రత్యేక సైనిక ఆపరేషన్" ప్రారంభించినందుకు తనకు ఎటువంటి విచారం లేదని పుతిన్ అన్నారు.

click me!