అస్సాంజే, స్నోడెన్‌లను క్షమించాలా?.. ట్విట్టర్‌లో మస్క్‌ పోల్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

By Sumanth KanukulaFirst Published Dec 4, 2022, 2:43 PM IST
Highlights

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి  వార్తల్లో నిలిచారు. అందుకు ట్విట్టర్‌లో ఆయన ప్రారంభించిన కొత్త పోల్‌ కారణంగా నిలిచింది. 

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి  వార్తల్లో నిలిచారు. అందుకు ట్విట్టర్‌లో ఆయన ప్రారంభించిన కొత్త పోల్‌ కారణంగా నిలిచింది. విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజేలను యుఎస్ ప్రభుత్వం క్షమించాలా? వద్దా? అనే దానిపై ఎలాన్ మస్క్ పోల్ నిర్వహిస్తున్నారు. ‘‘నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు.. కానీ ఈ పోల్ నిర్వహిస్తానని వాగ్దానం చేశాను. అసాంజే, స్నోడెన్‌లను క్షమించాలా?’’ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. 

అమెరికా మిలిటరీ, ఇంటెలిజెన్స్‌కు చెందిన ఆరోపించిన రహస్య, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసిన తర్వాత అస్సాంజే, స్నోడెన్ ఇద్దరూ ప్రవాసంలో ఉన్నారు. అసాంజే ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అయితే అతడిని తమ దేశం తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. వాటిని అస్సాంజే ఎదుర్కొంటూనే ఉన్నారు. మరోవైపు స్నోడెన్‌కు సెప్టెంబరులో వ్లాదిమిర్ పుతిన్ రష్యా పౌరసత్వం మంజూరు చేశారు. ఇటీవల స్నోడెన్ రష్యా పాస్‌పోర్ట్ అందుకున్నట్లు తెలిసింది.

ట్రంప్ పోల్ పెట్టిన ఏడు గంటల్లోనే 1.7 మిలియన్స్‌కు పైగా నెటిజన్స్ ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 80 శాతం మంది  ఎడ్వర్డ్ స్నోడెన్, జూలియన్ అస్సాంజే‌లకు క్షమాభిక్ష పెట్టాలని సానుకూలంగా స్పందించారు. మరో 20 శాతం మాత్రం వ్యతిరేకించారు. ఓటింగ్ ముగియడానికి ఇంకా 17 గంటల సమయం ఉంది. 

ఇక, ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఇలాంటి పోల్స్ నిర్వహిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్దరణ విసయంలో ఇదే విధంగా పోల్ నిర్వహించారు. 
 

click me!