
గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.. అటువంటి పరిస్థితిలో రష్యా అధ్యక్షుడికి ఊహించని పరిణామం ఎదురైంది. రష్యాలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ తన సొంత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రిపై యెవ్జెనీ ప్రిగోజిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు రష్యన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయనున్నట్టు సంచలన ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో సరిహద్దు యుద్ధాన్ని ఎదుర్కోవాలా ?లేదా అంతర్గత వ్యతిరేకతను ఎదుర్కోవాలా? అనేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాలుగా మారింది. కానీ.. శనివారం రాత్రి నాటికి.. ఈ ఉద్రిక్తత పరిస్థితులను తగ్గాయి. వాగ్నర్ గ్రూప్ అధిపతి , రష్యా ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించారు.
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ఆపరేషన్‌పై ప్రభావం పడదు
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను తిరుగుబాటు ప్రభావితం చేయదని క్రెమ్లిన్ పేర్కొంది. వాగ్నర్ తిరుగుబాటు కీవ్‌పై రష్యా ప్రచారాన్ని ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదని డిమిత్రి పెస్కోవ్ అన్నారు. రక్తపాతాన్ని నివారించడానికి యెవ్జెనీ ప్రిగోజిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ప్రిగోజిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
రష్యాలో తిరుగుబాటు ముప్పు తప్పింది
రష్యాలో అంతర్యుద్ధం , తిరుగుబాటు ప్రమాదం నివారించబడింది. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేస్తున్న ప్రైవేట్ ఆర్మీ అయిన వాగ్నెర్ గ్రూప్ అధిపతి యవ్జెనీ వి. ప్రిగోజిన్ తన యోధులను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడి కార్యాలయానికి చెందిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. తిరుగుబాటును అంతం చేసే ఒప్పందంలో భాగంగా ప్రైవేట్ మిలిటరీ కంపెనీ వాగ్నర్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ పొరుగున ఉన్న బెలారస్‌కు వెళ్లనున్నరని తెలిపారు.
వాగ్నర్ చీఫ్‌పై ఉన్న క్రిమినల్ కేసు కూడా మూసివేయబడుతుందని ఆయన తెలిపారు. వాగ్నర్ గ్రూప్ సభ్యులు కూడా ప్రాసిక్యూట్ చేయబడరనీ క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. ముందు ముందు వారి సాహసోపేత చర్యలను కూడా తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని అన్నారాయన. ప్రిగోజిన్, అతని యోధులందరూ దక్షిణ నగరమైన రోస్టోవ్-ఆన్-డాన్‌లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని వారు గతంలో స్వాధీనం చేసుకున్నారని RIA వార్తా సంస్థ నివేదించింది.
పుతిన్ రష్యాలో లేరు - జెలెన్స్కీ
పుతిన్ మాస్కోలో లేరని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అదే సమయంలో పుతిన్‌పై జెలెన్స్కీ విరుచుకుపడ్డాడు. చెడు మార్గాన్ని ఎంచుకునే వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా తన బలహీనతను, తన ప్రభుత్వ మూర్ఖత్వాన్ని దాచడానికి చాలా కాలం పాటు ప్రచారాన్ని ఉపయోగించుకుందని, ఇప్పుడు చాలా గందరగోళం ఉందని, ఎన్ని అబద్ధాలు దాచలేనన్నారు. ఈ రోజు రష్యా బలహీనత అందరి ముందు ఉందనీ, రష్యా తన కిరాయి సైనికులను తమ భూమిపై ఎక్కువ కాలం ఉంచుకుంటే.. అది తరువాత మరింత గందరగోళం, సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు.