ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్రపతి

By ramya neerukondaFirst Published Nov 23, 2018, 9:51 AM IST
Highlights

జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య  విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఏర్పాటు చేశారు. 

 జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య  విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం  ఆవిష్కరించారు. గాంధీజీ 150వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్‌తో కలిసి కోవింద్ మహాత్మునికి నివాళులు అర్పించారు. 

మహాత్ముడు చెప్పిన అహింస, శాంతి సందేశాలు ప్రపంచం నలుమూలలా ప్రాచుర్యం పొందాయని ఈ సందర్భంగా కోవింద్‌ గుర్తు చేశారు. మహాత్ముని కీర్తి, అతను బోధించిన విలువలు విశ్వవ్యాప్తమయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. భారత్‌లోలాగే భిన్న సంస్కృతులు, కులమతాలు ఉన్న ఆస్ట్రేలియాలాంటి సమాజాలను గాంధీ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆయన పేర్కొన్నారు. 


రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి కోవింద్ ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు కూడా పాల్గొనడం విశేషం. 

click me!