President Kovind Bangladesh Visit: బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం..

By Sumanth KanukulaFirst Published Dec 15, 2021, 5:36 PM IST
Highlights

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం బంగ్లాదేశ్ (Bangladesh) చేరుకున్నారు. ఆయనకు ఢాకాలో ఘన స్వాగతం లభించింది. స్వతంత్ర బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలలో కోవింద్ పాల్గొననున్నారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం బంగ్లాదేశ్ (Bangladesh) చేరుకున్నారు. స్వతంత్ర బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలలో కోవింద్ పాల్గొననున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి కోవింద్.. తన భార్య సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్‌లతో పాటుగా అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి ప్రత్యేక ఎయిర్ ఇండియా వన్ విమానంలో ఆయన బంగ్లాదేశ్ రాజధాని డాకా చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం లభించింది. విమానం నుంచి దిగిన అనంతరం అక్కడి సైన్యం రాష్ట్రపతి కోవింద్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. 21 తుపాకుల గౌరవ వందనం చేశారు. విమానశ్రయం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ (Abdul Hamid), ఆయన సతీమణి రషీదా ఖానమ్ కోవింద్ పలికారు. ఎయిర్‌పోర్ట్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న ఆ దేశ మంత్రులు, సైనిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు కోవింద్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. 

విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బంది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రపతి కోవింద్‌ను రాజధాని శివార్లలోని సవార్‌లోని జాతీయ స్మారక చిహ్నం వద్దకు కాన్వాయ్‌లో వెళ్లారు. ఆ స్మారకం వద్ద యుద్దవీరులకు కోవింద్ నివాళులర్పించారు.  విముక్తి పోరాట ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి జీవితాలను త్యాగం చేసినవారి స్ఫూర్తి మన ఆలోచనలు, చర్యలకు మార్గదర్శనంగా నిలవాలని కోవింద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోవింద్ ఓ అశోక మొక్కను నాటారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

1971లో పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించగా.. ప్రస్తుతం ఆ దేశం golden jubilee celebrations of independence జరుపుకుటుంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి కోవింద్‌ను గౌరవ అతిథిగా బంగ్లాదేశ్ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే కోవింద్.. బంగ్లాదేశ్ పర్యటకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల గురించి కూడా చర్చించనున్నారు. ఇక, కోవిడ్ వ్యాప్తి తర్వాత రామ్‌నాథ్ కోవింద్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. 

 

President Ram Nath Kovind arrives in Dhaka, Bangladesh. The President will participate in the special celebrations of Mujib Shato Borsho and the 50th anniversary of Bangladesh’s Liberation. pic.twitter.com/8vx2ppj7s7

— President of India (@rashtrapatibhvn)

రామ్‌నాథ్ కోవింద్ పర్యటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమిన్ మీడియాతో మాట్లాడుతూ.. కోవింద్ పర్యటనను ఉత్సవంగా అభివర్ణించారు. దైపాక్షికు సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను కోవింద్ పర్యటనలో కవర్ చేయబడతాయని చెప్పారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 15 నుంచి 17 వరకు తమ దేశంలో పర్యటించునున్నారని చెప్పారు. ఇది రెండు దేశాల మధ్య సత్సబంధాలకు విశిష్ట సంకేతమని పేర్కొన్నారు.

click me!