బిడ్డ పుట్టిన తర్వాత తాను స్నానం చేయిస్తానని మాయ మాటలు చెప్పి తన వద్దకు రప్పించుకుంది. అనంతరం ఆమె తన భర్తతో కలిసి మాఫ్రాను ఇటుకలతో చంపింది.
కడుపుతో ఉన్న స్నేహితురాలి పట్ల ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. నిండు గర్భిణీగా ఉన్న స్నేహితురాలికి వీలైతే ఏదైనా సహాయం చేయాల్సింది పోయి.. ఆమె కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లింది. ఆ బిడ్డ కోసం స్నేహితురాలిని కూడా చంపేసింది. ఈ దారుణ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాంటా కాటెరినా రాష్ట్రం కానెలిన్హా నగరంలో ఫ్లావియా గోడిన్హో మాఫ్రా(24) అనే యువతి నిండు గర్భిణి. మరి కొద్ది రోజుల్లో ఆమెకు ప్రసవం కానుంది. కాగా.. అలాంటి సమయంలో.. ఆమె చిన్ననాటి స్నేహితురాలు మాఫ్రా వద్దకు వెళ్లింది.
బిడ్డ పుట్టిన తర్వాత తాను స్నానం చేయిస్తానని మాయ మాటలు చెప్పి తన వద్దకు రప్పించుకుంది. అనంతరం ఆమె తన భర్తతో కలిసి మాఫ్రాను ఇటుకలతో చంపింది. తర్వాత ఆమె కడుపును పదునైన కత్తితో కోసి అందులోని నవజాత శిశువును దొంగిలించింది. ఆ బిడ్డను తన వద్దే పెంచుకోవడం మొదలుపెట్టింది.
కాగా.. కొద్ది రోజుల తర్వాత మాఫ్రా మృతదేహం ఆమె భర్తకు ఓ యార్డులో కనిపించడం గమనార్హం. బిడ్డ కోసం వెతకకగా.. మాఫ్రా స్నేహితురాలి వద్ద లభించింది. వెంటనే మాఫ్రా భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు జనవరిలో గర్భస్రావం అయిందని, శిశువును దొంగిలించేందుకే మాఫ్రాను చంపేశానని ఆమె స్నేహితురాలు పోలీసులకు చెప్పింది.