భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రించే యత్నం... పాక్‌కు ఐరాసలో భంగపాటు

By Siva KodatiFirst Published Sep 3, 2020, 2:26 PM IST
Highlights

సందు దొరికితే చాలు భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్ చేయని కుట్ర లేదు. ఈ నేపథ్యంలో అలా ప్రయత్నించి మరోసారి భంగపాటుకు గురైంది. అది కూడా ఐక్యరాజ్యసమితి వేదికపై

సందు దొరికితే చాలు భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్ చేయని కుట్ర లేదు. ఈ నేపథ్యంలో అలా ప్రయత్నించి మరోసారి భంగపాటుకు గురైంది. అది కూడా ఐక్యరాజ్యసమితి వేదికపై.

వివరాల్లోకి వెళితే.. బుధవారం యూఎన్ 1267 కమిటీ ముందు వేణుమాధవ్ డోంగారా, అజయ్ మిస్త్రీ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది.

అయితే ఇందుకు తగిన సాక్ష్యాధారాలను చూపాలని ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలైన యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలు కోరాయి. ఇందుకు సరైన ఆధారాలు చూపలేక దాయాది దేశం నీళ్లు నమిలింది.

అంతటితో ఆగకుండా మరో ఇద్దరు భారతీయులు గోవింద పట్నాయక్, అంగారా అప్పాజీలను కూడా ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. రెండోసారి కూడా భద్రతా మండలి సభ్యదేశాలు దీనిని తిప్పికొట్టాయి. దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ కృష్ణమూర్తి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘ ఉగ్రవాదానికి మతపరమైన రంగు పులమటం ద్వారా 1267 కమిటీ ప్రత్యేక చర్చల్ని రాజకీయం చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా మండలి అడ్డుకుందని.. ఇందుకు గాను సభ్యదేశాలకు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. 

click me!