పండగ పూట భారత రాయబారి నివాసానికి కరెంట్ కట్...పాకిస్థాన్ దుశ్చర్య

By Arun Kumar PFirst Published Jan 1, 2019, 1:41 PM IST
Highlights

ఓ వైపు శాంతి చర్చలు అంటూనే బార్డర్ లో భారత సైనికులపై కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్...అంతర్గతంగా దేశంలోనూ భారతీయ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండగ పూట ఇస్లామాబాద్ లో భారత  రాయబార నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి దుశ్చర్యకు పాల్పడింది. 

ఓ వైపు శాంతి చర్చలు అంటూనే బార్డర్ లో భారత సైనికులపై కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్...అంతర్గతంగా దేశంలోనూ భారతీయ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండగ పూట ఇస్లామాబాద్ లో భారత  రాయబార నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి దుశ్చర్యకు పాల్పడింది. దీంతో పండగ పూట ఆనందంగా గడపాల్సిన రాయబార నివాసంలో కుటుంబాలు కటిక చీకటిలో అలమటించారు. దీని కారణంగా రాయబార నివాసంలోని చిన్నారులతో పాటు వృద్దులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై ఇండియన్ హైకమీషన్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  ఇస్లామాబాద్ లోని సెక్టార్ ఎఫ్-7/2, స్ట్రీట్ నంబర్ 18లోని భారత రాయబారి ఇంటికి ఉదయం 7 గంటల నుంచి 10:45 గంటల వరకు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. అయితే ఈ కార్యాలయంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి రిపేర్లు లేవని...ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ నిలిపివేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. 

ఇలాంటి ఘటనలు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత రాయబార కార్యాలయం పాకిస్థాన్ కు సూచించింది. ఈ వ్యవహారికి సంబంధించిన అధికారులను విచారించి మరోసారి ఇలాంటి తప్పులు జరక్కుండా హెచ్చరించాలని కోరింది. 

   

click me!