శ్రీలంక బాంబు పేలుళ్ల మృతులకు మోడీ నివాళులు

Siva Kodati |  
Published : Jun 09, 2019, 03:26 PM IST
శ్రీలంక బాంబు పేలుళ్ల మృతులకు మోడీ నివాళులు

సారాంశం

ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కోలంబోలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో మరణించిన వారికి భారత ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు

ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కోలంబోలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో మరణించిన వారికి భారత ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన అక్కడి నుంచి శ్రీలంక చేరుకున్నారు.

ఈ సందర్బంగా కొలంబో విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని రణీల్ విక్రమసింఘే... మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల బాంబు పేలుళ్లు సంభవించిన కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోని చర్చిని ప్రధాని సందర్శించి.. మరణించిన వారికి నివాళులర్పించారు.

శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు ప్రతిపక్షనేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సతో సమావేశం కానున్నారు. లంక పర్యటన నుంచి ప్రధాని నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?