దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: 12 మంది భారతీయుల మృతి

Published : Jun 07, 2019, 03:50 PM IST
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: 12 మంది భారతీయుల మృతి

సారాంశం

దుబాయ్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో  12 మంది భారతీయులు ఉన్నారు.ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడ ధృవీకరించింది.  

దుబాయ్: దుబాయ్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారిలో  12 మంది భారతీయులు ఉన్నారు.ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడ ధృవీకరించింది.

31 మంది ప్రయాణీకులతో ఒమన్ నుండి దుబాయ్‌కు తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యలోని  ఓ మెట్రో స్టేషన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది అతి వేగంగా వస్తున్న బస్సు ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకొంటూ వెళ్లి సైన్ బోర్డును ఢీకొట్టింది. 

దీంతో బస్సులోని 17 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 12 మంది భారతీయులేనని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ విపుల్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న  ఆసుపత్రిలో చేర్చారు.భారతీయుల మృతదేహలను రెండు రోజుల్లో స్వదేశానికి పంపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే