
Titan Submersible: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ మిని జలాంతర్గామి పర్యాటన విషాదాంతంగా మారింది. ఈ జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నమని ఓషన్ సంస్థ పేర్కొంది.
"ప్రయాణీకులు నిజమైన అన్వేషకులు, ప్రయాణీకులకు ధైర్యం, మహాసముద్రాలను అన్వేషించాలనే అభిరుచి ఉంది. ఈ విషాద సమయంలో మా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ఇందుకు మమ్మల్ని క్షమించండి. ఈ ఘటనకు చింతిస్తున్నాం" అని ఓషన్ గేట్ సంస్థ సంతాపం తెలిపింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ఉత్తర అట్లాంటిక్‌లో జలాంతర్గామి తన ప్రయాణాన్ని ముగించింది. ఆ సమయంలో సిబ్బందికి నాలుగు రోజుల విలువైన ఆక్సిజన్ ఉంది. యాత్రలో 96 గంటలు గడిచాయి. జలాంతర్గామి ఆక్సిజన్ అయిపోయిందని సంస్థ వెల్లడించింది.
జలాంతర్గామి శిథిలాలు
టైటానిక్ శిథిలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ టైటాన్ జలాంతర్గామి శకలాలు కనిపించాయని ఒకరోజు ముందుగానే యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే.. ఈ శిధిలాలు తప్పిపోయిన జలాంతర్గామితో ముడిపడి ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియలేదు. అధికారులు సమాచారాన్ని మదింపు చేస్తున్నట్లు అధికారులు గురువారం ట్వీట్ చేశారు.
జలాంతర్గామిలో ఎవరెవరున్నారు.
టైటానిక్ షిప్ అవశేషాలను వీక్షించేందుకు ఐదుగురు సభ్యులను బ్రుందం మినీ జలాంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి బయలు దేరింది. ఈ ప్రయాణంలో బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్. ఇతడు దుబాయ్‌కి చెందిన యాక్షన్ ఏవియేషన్ ఛైర్మన్. నమీబియా నుండి చిరుతలను తీసుకువచ్చే ప్రాజెక్ట్‌లో భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి హమీష్ హార్డింగ్.
అలాగే.. బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త ప్రిన్స్ దావూద్, అతని కుమారుడు సులేమాన్ కూడా ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. ప్రిన్స్ దావూద్, ఎరువులు, వాహనాల తయారీ, ఇంధనం,డిజిటల్ టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టే పాకిస్తాన్‌లోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన ఆగ్రో కార్పొరేషన్‌కి వైస్-ఛైర్మన్. ఒక వెబ్‌సైట్ ప్రకారం.. అతను తన భార్య , ఇద్దరు పిల్లలతో UK లో నివసిస్తున్నాడు.
అలాగే.. Oceangate వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టాక్‌టన్ రష్ , ఫ్రెంచ్ పైలట్ పాల్-హెన్రీ నార్గోలెట్ కూడా జలాంతర్గామిలో ఉన్నారు.