సేల్స్ మెన్ అవతారమెత్తిన మస్క్ మామా.. ‘ప్లీజ్ కొనండీ’ అంటూ ట్వీట్.. వైరల్...

Published : Oct 13, 2022, 12:55 PM IST
సేల్స్ మెన్ అవతారమెత్తిన మస్క్ మామా.. ‘ప్లీజ్ కొనండీ’ అంటూ ట్వీట్.. వైరల్...

సారాంశం

ప్రపంచ కుబేరుడు.. తెలుగువారు ముద్దుగా మస్క్ మామా అని పిలుచుకునే టెస్లా సీఈఓ ఎలాస్ మస్క్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

న్యూఢిల్లీ : ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉండే ప్రపంచ కుబేరుడు,  టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ ఇంటర్నెట్ లో చర్చకు దారి తీసింది. ఇటీవల తాను కొత్తగా లాంచ్ చేసిన  ‘బర్ట్న్ హెయిర్’ పెర్ ఫ్యూమ్ ను ప్రమోట్ చేస్తూ ట్విట్టర్లో మరోసారి సంచలనం రేపుతున్నారు. తనను తాను పెర్ ఫ్యూమ్ సేల్స్ మెన్ గా పేర్కొన్న మస్క్ ‘నా బ్రాండ్ పెర్ఫ్యూమ్ ను కొనండి ప్లీజ్.. మీరు ఇది కొంటే నేను ట్విట్టర్ ను కొనుక్కుంటా’  అంటూ వేడుకోవడం గమనార్హం.

ఈ మేరకు మస్క్ గురువారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై లైక్ లు,  కామెంట్ ల వర్షం ఒక రేంజ్ లో కురుస్తోంది. 25వేలకు పైగా రీ ట్వీట్లు, విభిన్న కామెంట్లతో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా 20వేల బాటిల్స్ సేల్ అయ్యాయి అంటూ పేర్కొన్నారు. తద్వారా  మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు అంశం మీద చర్చను మరోసారి తెరమీదికి తీసుకొచ్చారు. పెర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్న అని ప్రకటించిన మస్క్ ఓమ్మిజెండర్ పెర్ఫ్యూమ్ ఆడామగా ఇద్దరికీ పనికి వస్తుందని వెల్లడించారు.  

Elon Musk: తూచ్.. అంతా ఉత్తదే.. జోక్ చేశా..! మస్క్ మావ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

సుమారు రూ.8,400(100డాలర్లు) వద్ద దాన్ని లాంచ్ చేసిన వెంటనే పదివేల బాటిల్ సేల్ అయ్యాయని.. ట్వీట్ చేయడమే కాదు మిలియన్ బాటిల్స్ సేల్స్.. మీడియా వార్తలు అంటూ గప్పాలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా, 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్ ను మొత్తంగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించారు మస్క్. కానీ,  నకిలీ ఖాతాలపై సరైన సమాచారం అందించలేదని ట్విట్టర్ పై విమర్శలు గుప్పించి మాస్క్ ఈ డీల్ ను ఉపసంహరించుకున్నప్పటికీ.. ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి  కోర్టుకు చేరిన ఈ వివాదంపై అమెరికా కోర్టు విచారణను గత వారం వాయిదా వేసింది. తద్వారా ఈ డీల్ పూర్తి చేయడానికి మస్క్ కు మరింత సమయం ఇచ్చింది. అయితే అక్టోబర్ 28 నాటికి ఈ డీల్ పూర్తి చేయాలని మస్క్ భావిస్తున్నారట. 
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?