అమెరికా: ఎయిర్‌పోర్ట్‌లో విమానం క్రాష్ ల్యాండింగ్ , మంటలు.. అందులో 126 మంది

Siva Kodati |  
Published : Jun 22, 2022, 03:46 PM ISTUpdated : Jun 22, 2022, 03:47 PM IST
అమెరికా: ఎయిర్‌పోర్ట్‌లో విమానం క్రాష్ ల్యాండింగ్ , మంటలు.. అందులో 126 మంది

సారాంశం

అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ల్యాండింగ్ సమయంలో టైర్లు తెరచుకోకపోవడంతో ఫ్లైట్ రన్‌వేపై దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు వున్నారు. 

అమెరికా ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయం (Miami International Airport)లో రెడ్ ఎయిర్ (Red Air) సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ (Plane Crash Land) అయింది. దీంతో విమానం కుడివైపు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్‌ సమయంలో... ముందు, వెనుక టైర్లు పూర్తిగా తెరుచుకోకపోవడంతో విమానం అమాంతం నేలను రాసుకుంటూ దూసుకెళ్లింది. పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, లోపలున్న సిబ్బంది సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణికులను కిందికి నెట్టేయడం, సమాయానికి ఫైరింజన్లు చేరుకోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే