విమానంలో సిగరెట్ తాగిన పైలెట్..51మంది మృతి

By ramya neerukondaFirst Published Jan 28, 2019, 2:03 PM IST
Highlights

విమానంలో పైలెట్ సిగరెట్ కాల్చడం వల్ల 51మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన నేపాల్ లో చోటుచేసుకుంది. 

విమానంలో పైలెట్ సిగరెట్ కాల్చడం వల్ల 51మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన నేపాల్ లో చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటన గతేడాది చోటుచేసుకోగా.. దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్‌-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్‌ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన ప్యానెల్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ పరిశీలించింది. అందులో పైలెట్ సిగరెట్ తాగినట్లు తెలిసింది. కాక్ పిట్ లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 

click me!