ఇరాన్ నూతన అధ్యక్షుడిగా పెజెష్కియాన్  

Published : Jul 06, 2024, 09:46 AM ISTUpdated : Jul 06, 2024, 09:51 AM IST
ఇరాన్ నూతన అధ్యక్షుడిగా పెజెష్కియాన్  

సారాంశం

ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియన్ ఎన్నికయ్యారు. తాజాగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.

Iran Elections 2024 Result : ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ప్రధాన ప్రత్యర్థి సయీద్ జలిలిని ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ మృతిచెందడంతో ఇరాన్ నూతనాధ్యక్షుడి ఎంపికకోసం ఎన్నికలు జరిగాయి.  

అయితే గత నెల జూన్ 28 నే ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రధాన పోటీదారులు పెజెష్మియన్, జలిలి ఇద్దరీకి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావాల్సిన 50 శాతం మెజారిటీ రాలేదు. దీంతో మరోసారి నిన్న(శుక్రవారం) పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఇవాాళ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. 

మసౌద్ పెజెష్మియాన్ 16.3 శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆయన సమీప ప్రత్యర్థి జలిలి 13.5 శాతం ఓట్లకే పరిమితం అయ్యారు. దీంతో దివంగత రైసీ స్థానంలో పెజెష్మియాన్ ఇరాన్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !