పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు.. పారామిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి

Published : Nov 24, 2025, 10:26 AM IST
Peshawar Blast

సారాంశం

పాకిస్థాన్ లో ఉదయం బాంబుల మోత మోగింది. ఇద్దరు వ్యక్తులు పారామిలిటరీ హెడ్ క్వార్టర్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇంకా ఉగ్రదాడులు కొనసాాగుతున్నట్లు సమాచారం.  

Pakistan Bomb Blast : పాకిస్థాన్‌లో పారామిలటరీ హెడ్‌క్వార్టర్స్‌పై దుండగులు దాడి చేశారు. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చనిపోయినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 

ఇద్దరు ఉగ్రవాదుల ఆత్మాహుతి

మొదటి ఆత్మాహుతి బాంబర్ హెడ్‌క్వార్టర్స్ గేటు దగ్గర, రెండో వ్యక్తి కాంపౌండ్‌లో దాడి చేసినట్టు రిపోర్ట్ వివరిస్తోంది. పోలీసులు, సైన్యం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హెడ్‌క్వార్టర్స్ లోపల ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు.

పెషావర్ లో ఉద్రిక్తత

 దాడి జరిగిన పారామిలటరీ హెడ్‌క్వార్టర్స్ సైనిక కంటోన్మెంట్ దగ్గరే ఉంది. ఆ ప్రాంతంలో చాలా మంది నివసిస్తున్నారు. అక్కడి రోడ్లను మూసివేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest Person: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. 174 దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద
Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !