పాకిస్తాన్ నేవీ ఎయిర్ స్టేషన్‌పై దుండగుల దాడి: భద్రత దళాల కాల్పుల్లో నలుగురు మృతి

By narsimha lode  |  First Published Mar 26, 2024, 9:45 AM IST


 పాకిస్తాన్ లో నేవీ ఎయిర్ స్టేషన్ పై టెర్రరిస్టులు దాడికి దిగారు.భద్రత దళాల కాల్పుల్లో టెర్రరిస్టులు మృతి చెందారు.


ఇస్లామాబాద్:పాకిస్తాన్ లోని రెండో అతి పెద్ద నౌకదళ ఎయిర్ స్టేషన్ పై మంగళవారం నాడు పీఎన్ఎస్ సిద్ది‌ఖ్ పై మంగళవారంనాడు తెల్లవారుజామున దాడి జరిగింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి బాధ్యత వహించినట్టుగా ది బలూచిస్తాన్ పోస్టు నివేదించింది.  బలూచిస్తాన్ ప్రాంతంలోని వనరులను చైనా, పాకిస్తాన్ దోపీడీ చేస్తున్నాయని  బీఎల్ఏ ఆరోపించింది. 

అయితే ఈ ఘటనలో ఎయిర్ స్టేషన్ వద్ద బందోబస్తును మరింత పెంచారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ఎయిర్ స్టేషన్ పై దాడికి పాల్పడిన  నలుగురు తిరుగుబాటుదారులను భద్రతా దళాలు చంపినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ఆటోమెటిక్ ఆయుధాలు, హ్యాండ్ గ్రనేడ్ లతో సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ నావల్ స్టేషన్ సిద్దిఖ్ పై దాడి చేశారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.దరిమిలా అప్రమత్తమైన  భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులకు దిగినట్టుగా  జిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. ఎయిర్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని  నివేదికలు తెలుపుతున్నాయి. ఉగ్రవాదులపై భద్రతా దళాలు దాడులకు దిగడంతో నలుగురు మృతి చెందినట్టుగా  ఈ నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు హతమైన తర్వాత ఈ ప్రాంతంలో  భద్రతా దళాలు క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టాయి.

Latest Videos

ఈ ఏడాది జనవరి 29న మాక్ సిటీపై, మార్చి  20న గ్వాదర్ లోని మిలటరీ ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్టుగా బలూచిస్తాన్ పోస్టు నివేదించింది. గ్వాదర్ లో జరిగిన దాడిలో  ఇద్దరు పాకిస్తాన్ సైనికులు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పోర్టు అథారిటీ కాలనీలో ప్రవేశించేందుకు యత్నించిన సమయంలో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
 

click me!