ఎయిర్ పోర్టులో డబ్బు సూట్ కేసులు.. ఇద్దరు అరెస్టు

Published : Nov 14, 2020, 10:01 AM ISTUpdated : Nov 14, 2020, 10:08 AM IST
ఎయిర్ పోర్టులో డబ్బు సూట్ కేసులు.. ఇద్దరు అరెస్టు

సారాంశం

 వారు అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు గుర్తించడంతో.. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

రెండు సూట్ కేసుల నిండా డబ్బుతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన లండన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చెక్ జాతీయులైన ఇద్దరు వ్యక్తులు లండన్ లోని హీత్రో విమానాశ్రయంలో 1.2 మిలియన్ పౌండ్ల నగదు తీసుకొని వెళుతూ అధికారులకు పట్టుపడ్డారు. కాగా.. మనీ లాండరింగ్ కేసు కింద వారిపై కేసు నమోదు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

కాగా.. నిందితులు సదరు వ్యక్తి వయసు 37, మహిళ వయసు 26గా గుర్తించారు. వారు అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు గుర్తించడంతో.. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

"వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని..దీనిలో భాగంగా అక్రమంగా నగదు తరలించడాన్ని అడ్డుకుంటామని " అని మంత్రి క్రిస్ ఫిల్ప్ ఒక ప్రకటనలో తెలిపారు.

భారీ మొత్తంలొ డబ్బు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదే విమానాశ్రయంలో అక్టోబర్ లో ఓ మహిళ ఇదే విధంగా నగదు తరలిస్తుండగా.. అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !