భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ చర్చలు జరపాలనుకుంటున్నా.. రష్యా పర్యటనకు ముందు పాక్ సీఎం ఇమ్రాన్ ఖాన్...

Published : Feb 23, 2022, 06:35 AM ISTUpdated : Feb 23, 2022, 06:36 AM IST
భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ చర్చలు జరపాలనుకుంటున్నా.. రష్యా పర్యటనకు ముందు పాక్ సీఎం ఇమ్రాన్ ఖాన్...

సారాంశం

దాయాది దేశమైన పాక్ తో భారత్ కు మధ్య ఉప్పు, నిప్పుగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్ ప్రధాని మోదీతో టెలివిజన్ టాక్స్ కు తాను సిద్ధం అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 

ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని narendra modiతో టెలివిజన్ చర్చలు జరపాలని అనుకుంటున్నట్లు ప్రధాని Imran khan తెలిపారు. రెండు రోజుల Russia పర్యటనకు ముందు... ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించ గలిగితే  భారత ఉపఖండంలోని కోట్లాది జనాభాకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు.

Terrorism, Kashmir ఇతరత్రా సమస్యల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘పాక్ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తే, చర్చలు జరుపుతామని భారత్  అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. ఉగ్రవాదం,  చర్చలు ఒకదానితో ఒకటి కలిసి సాగలేవు అని తేల్చి చెప్పింది.

అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం తమ ప్రభుత్వ విధానమని.. అయితే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో వాణిజ్యం కూడా తగ్గిపోయింది అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ..  ‘ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు.. పాక్ కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నాం’  అని అన్నారు.  ఆర్థిక సహకారంపై చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలవనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక పాకిస్తానీ నాయకుడు రష్యాకు వెళ్తుండటం ఇదే మొదటిసారి. 

ఇదిలా ఉండగా, జనవరి 26న ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పాక్ ను ఏకిపారేసింది. 2008లో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడి నిందితులకు Pakistan మద్దతు ఇంకా అందుతూనే ఉందని United Nations Security Council (యూఎన్ఎస్ పీ)లో bharat ఆగ్రహం వ్యక్తం చేసింది. అది చాలక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ..  ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది.

సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశంపై భారత్ విరుచుకుపడింది. ‘ప్రస్తుతం మనం పౌరుల రక్షణపై చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి Terroristల నుంచి ముప్పు వస్తుంది. 2008లో ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన  ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు వారి దేశం మద్దతు లభిస్తూనే ఉంది’  అని వ్యాఖ్యలు చేసింది.

‘ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం, మద్దతు  ఇవ్వడంలో పాకిస్తాన్ చరిత్ర, దాని విధానం సభ్యదేశాలకు తెలుసు. సాయుధ మూకలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆయుధాలు అందించే దేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు అతిథ్యం ఇస్తున్న దేశంగా దారుణమైన రికార్డును సొంతం చేసుకుంది. అది ఎంతగా ఉందంటే… ప్రపంచవ్యాప్తంగా  చాలా ఉగ్రదాడులు  ఏదో ఒక రూపంలో  పాకిస్తాన్  మూలాల్ని కలిగి ఉన్నాయి’ అంటూ తీవ్రంగా స్పందించారు.

అలాగే Jammu and Kashmir అంశంపై మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్, లద్ధాఖ్  ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది.  అలాగే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా తనలో భాగమేనని,  వాటిని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది. తాము పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటామని ఈ సందర్భంగా భారత్ తన వైఖరిని వెల్లడించింది. గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా  రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి  ఉన్నాం  అంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా ఆసిమ్ మునీర్
30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?