టీవీ యాంకర్‌పై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా: కనికరించేది లేదన్న ఇమ్రాన్

By Siva KodatiFirst Published Aug 5, 2019, 8:09 AM IST
Highlights

పాకిస్తాన్‌లోని ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ నజామ్ సేథీకి ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి సేథీ తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాదాపు రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించిన నోటీసును ఆయన సేథీకి పంపారు. 

పాకిస్తాన్‌లోని ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ నజామ్ సేథీకి ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి సేథీ తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాదాపు రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

ఇందుకు సంబంధించిన నోటీసును ఆయన సేథీకి పంపారు. సదరు జర్నలిస్ట్‌పై ఎటువంటి కరుణ చూపేది లేదని ఇమ్రాన్ తరపు న్యాయవాది స్పష్టం చేయడంతో ఈ వార్త పాకిస్తాన్ మీడియా కమ్యూనిటీలో వైరల్ అయ్యింది.

కాగా జమ్మూకశ్మీర్ వ్యవహారంలో భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానని తనతో అన్నట్లు చెప్పారు.

నియంత్రణ రేఖ వెంబడి అమాయక ప్రజలపై భారత్ చేస్తున్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని... నిషేధిత క్లస్టర్ బాంబులను వినియోగించడం ఒప్పందాలను ఉల్లంఘించడమేనని ఇమ్రాన్ ధ్వజమెత్తారు.

కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ చర్యలు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పడమేనని ఆయన ట్వీట్ చేశారు. 

click me!