ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ ఒకటి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Published : Oct 15, 2022, 11:38 AM ISTUpdated : Oct 15, 2022, 11:46 AM IST
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ ఒకటి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

సారాంశం

పాకిస్తాన్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ను ఒకటిగా అభివర్ణించారు.

పాకిస్తాన్‌‌కు అంతర్జాతీయంగా మరోసారి ఘోర అవమానం ఎదురైంది. పాకిస్తాన్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ను ఒకటిగా అభివర్ణించారు. శుక్రవారం డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్‌లో  జో బైడెన్ మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన‌లో జో బైడెన్ కామెంట్స్‌ను ఉటంకించింది.  

‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్‌ను ఒకటిగా నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం గురించి, అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందనే అంశం గురించి మాట్లాడుతూ జో బైడెన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇతర దేశాలతో అమెరికా సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !