
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రాత్రి రద్దు చేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. సభలనే సభ్యుల మద్దతుతో ఈ విషయం చెప్పాలని భావిస్తున్నానని చెప్పడంతో ఈ రోజు రాత్రి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు రద్దు చేశారు. దీంతో త్వరలోనే పాకిస్తాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని షరీఫ్ సూచనను అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ఆలకించారు. రాత్రిపూట దాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజులు ముందుగానే రద్దయింది. నిన్న షరీఫ్ అసెంబ్లీలో చివరి ప్రసంగం చేశారు.
సాధారణంగా పాకిస్తాన్‌లో ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే.. రెండు నెలలోపు ఎలక్షన్స్ నిర్వహించేది. కానీ,ముందస్తుగానే అసెంబ్లీ రద్దు కావడంతో ఎన్నికల నిర్వహనకు 90 రోజుల సమయం ఉన్నది.
Also Read: దొంగ ప్రేమికుడు: బార్ గర్ల్‌ఫ్రెండ్ కోసం 41 దొంగతనాలు, 50 లక్షలు ఖర్చు పెట్టిన దొంగ
పాకిస్తాన్‌లో కొత్త జనాభా గణన ఫలితాలు వచ్చాయి. డెమోగ్రఫీలో చాలా మార్పు వచ్చింది. జనాభా, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉన్నది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి గల 90 రోజుల్లోనే డీ లిమిటేషన్ పనుల పూర్తి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఒక వేళ ఇది సాధ్యం కాదనుకుంటే ఎన్నికలకు గడువును మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు.