రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన పాకిస్తానీ: ఏమైందో తెలుసా?

By narsimha lodeFirst Published Oct 8, 2020, 11:29 AM IST
Highlights

లాటరీ రూపంలో  ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే ఆయన కోటీశ్వరుడయ్యాడు.  ఈ లాటరీ దక్కడంతో ఆయన  ఉబ్బితబ్బియ్యాడు.


దుబాయ్:లాటరీ రూపంలో  ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే ఆయన కోటీశ్వరుడయ్యాడు.  ఈ లాటరీ దక్కడంతో ఆయన  ఉబ్బితబ్బియ్యాడు.పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ షఫీఖ్  దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు.  ఆయన వయస్సు 48 ఏళ్లు.  

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియమ్ మిలియనీర్ లాటరీ కాంటెస్ట్ లో ఆయన పది లక్షల డాలర్ల లాటరీని గెలుచుకొన్నాడు.  ఇండియా కరెన్సీ ప్రకారంగా దీని విలువ రూ. 7 కోట్ల 33 లక్షలు. 

ఈ లాటరీ తానుకొనుగోలు చేసిన లాటరీకే దక్కిందని తెలుసుకొన్న ఆయన సంతోషానికి అవధుల్లేవు. తొలుత తనకు లాటరీ దక్కిందనే విషయం ఆయన నమ్మలేదు. లాటరీ ఫలితాలను సరి చూసుకొన్న తర్వాత ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.లాటరీలో గెలుచుకొన్న డబ్బులను తన పిల్లల చదువు కోసం ఉపయోగిస్తానని మహమ్మద్ ప్రకటించారు.

గతంలో ఇదే రకంగా దుబాయ్ లో నివసిస్తున్న ఇండియన్లకు కూడ పలు లాటరీల్లో భారీ మొత్తంలో నగదును గెలుచుకొన్నారు.లాటరీపై నమ్మకంతో కొనుగోలు చేసిన కొందరి నమ్మకాలు వమ్ముకాలేదు. లాటరీల్లో పెద్ద మొత్తంలో డబ్బులను గెలుపొందారు. 

click me!