రసాయన శాస్త్రంలో విశేష కృషి: ఇద్దరికి నోబెల్ ప్రైజ్

By narsimha lodeFirst Published Oct 7, 2020, 4:19 PM IST
Highlights

 రసాయన శాస్త్రంలో విశేష సేవలు చేసిన ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.ఎమ్మాన్యుయేల్ చార్పెంటీర్, జెన్నీఫర్ ఏ డౌడ్నాలకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ దక్కింది.


స్టాక్ హోమ్: రసాయన శాస్త్రంలో విశేష సేవలు చేసిన ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.ఎమ్మాన్యుయేల్ చార్పెంటీర్, జెన్నీఫర్ ఏ డౌడ్నాలకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ దక్కింది.

జన్యు టెక్నాలజీలో పదునైన సాధనాన్ని కనుగొన్నారు. సీఆర్ఐఎస్‌పీఆర్/సీఎఎస్ 9  జన్యు కత్తెర గా వీటిని పిలుస్తారు. వీటిని ఉపయోగించి జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను ఎక్కువ కచ్చితత్వంతో మార్చేందుకు వీలు కలుగుతుంది.

సీఆర్ఐఎస్‌పీఆర్/సీఎఎస్ 9 జన్యు సవరణ సాధనాలు పరమాణు జీవిత శాస్త్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. మొక్కల పెంపకానికి కొత్త అవకాశాలను తెచ్చాయి. క్యాన్సర్ చికిత్సలకు దోహదం చేశాయి. 

మంగళవారం నాడు భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. రోజర్ పెన్ రోజ్, రైన్ హర్డ్ గెంజెల్, ఆండ్రీయా గెజ్ లకు నోబెల్ బహుమతి దక్కింది.జినోమ్ ఎడిటింగ్ విధానం కోసం వీరిద్దరూ చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి దక్కింది.

also read:ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

మూడు రోజుల నుండి వరుసగా పలు విభాగాల్లో సేవలు అందించినవారికి నోబెల్ అకాడమీ బహుమతులను ప్రకటిస్తోంది. తొలుత వైద్య రంగంలో విశేష సేవలు అందించినవారికి బహుమతిని ప్రకటించింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో, ఇవాళ రసాయన శాస్త్రంలో సేవలు అందించినవారికి నోబెల్ అకాడమీ బహుమతులను ప్రకటించింది.
 

click me!