
న్యూఢిల్లీ: ఓ పాకిస్తాన్ వ్యక్తి తన మాజీ భార్యను 700 కిలో మీటర్లు కారులో ప్రయాణించి మరీ హత్య చేశాడు. ఆమె టిక్ టాక్ వీడియోలు చేయడం ఆయనకు నచ్చలేదు. అమెరికాలో నివసిస్తున్న ఆ బిజినెస్ మ్యాన్ 700 కిలోమీటర్లు ప్రయాణించి అదే దేశంలో నివసిస్తున్న భార్య దగ్గరకు వెళ్లాడు. తుపాకీతో తన భార్యను చంపేశాడు. ఆ తర్వాత తాను మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
29 ఏళ్ల సానియా ఖాన్ టిక్ టాకర్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. ఆమెను 36 ఏళ్ల రాహిల్ అహ్మద్ వివాహం చేసుకున్నాడు. రాహిల్ అహ్మద్ బిజినెస్ మ్యాన్. కాని వారి పెళ్లి కనీసం ఒక ఏడాది కూడా నిలవలేకపోయింది. గతేడాది వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో వారి విడాకుల ప్రక్రియ పూర్తయింది.
రాహిల్ అహ్మద్ కొంచెం రాడికల్. సాంప్రదాయ ఆలోచనలే మోస్తుంటాడు. తన భార్య సరికొత్త మార్గంలో దూసుకుపోవడాన్ని, నవీన పోకడలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంగా వారిద్దరూ విడిపోయినట్టు కొన్ని వార్తలు తెలిపాయి.
వారి విడాకుల తర్వాత సానియా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. నీవు జీవితంలో ఏదో ఓడిపోయావని దక్షిణ ఆసియా అమ్మాయిలు లాగే ఉన్నానని వివరించారు. విడాకులు తీసుకున్నందుకు ఎమోషనల్ సపోర్ట్ ఉండదని, వారికి సమాజమే ఒక లేబుల్ వేస్తుందని, ఆమెతో ఎవరూ మాట్లాడకుండా కొంతకాలం పాటు ఒంటిదాన్ని చేస్తారంటా..! అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఈ పోస్టు తర్వాత భర్త రాహిల్ అహ్మద్ బాధపడ్డాడు. ఆమెకు విడాకులు ఇచ్చినప్పటికీ తన పై ప్రతీకారం తీర్చుకోవాని అనుకున్నాడు.
సానియా ఓ టిక్ టాక్ చేసింది. ఆ వీడియో చూసి రాహిల్ అహ్మద్ తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. అందుకే జార్జియా నుంచి 700 కిలోమీటర్లు కారులో ప్రయాణించి ఇల్లినాయస్‌లో తన మాజీ భార్య ఉంటున్న ఇంటికి చేరాడు.
పోలీసులు ఆమె ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. ఏదో కౌన్సెలింగ్ కోసం ఆమె దగ్గరకు వచ్చారు. భర్త ఆమెతోపాటే లోపలే ఉన్నాడు. పోలీసులు బయట ఆమె కోసం ఎదురుచూస్తుండగా రెండు సార్లు గన్ కాల్పుల శబ్దం వినిపించింది. ముందు తన మాజీ భార్యను కాల్చిసి మరో గదిలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.