
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్.. భారత్‌కు గట్టి బదులిచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏం చేయాలి అన్న దానిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశంలోని అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో తమ దేశంలోని అన్ని విమానాశ్రయాలను తక్షణం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దేశవాళీతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
దేశ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాల్‌కోట్, తదితర విమానాశ్రయాలను మూసివేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్‌పోర్టులను తెరవరాదని, ఇప్పటికే గాల్లో ఉన్న విమానాలన్నీ, తక్షణం సమీపంలోని విమానాశ్రయాల్లో ల్యాండ్ కావాలని ఆదేశించింది.
విమానాశ్రయాలన్నీ సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయాయని, కేవలం సైనిక విమానాలకే పరిమితమని వెల్లడించింది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.