కారులో ముద్దుపెట్టుకున్న ప్రేమికులు.. అరెస్ట్

First Published 14, Aug 2018, 10:47 AM IST
Highlights

పోలీసులు అక్కడకు వెళ్లేవరకూ వాళ్లు ఇంకా అలాగే ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కరాచీ కంపెనీ పోలీస్ స్టేషన్‌‌కు తీసుకు వచ్చాం. 

కారులో ముద్దుపెట్టుకున్నారని.. ఇద్దరు ప్రేమికులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఇస్లామాబాద్‌లోని సిటీ సెంటర్ వద్ద రోడ్డుపై కారులో ముద్దు పెట్టుకుంటూ సన్నిహితంగా ఉన్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారంటూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ జంటకు 3 నెలలు జైలు శిక్షతో పాటు జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ ఘటనపై పోలీస్ అధికారి జుల్పికర్ అహ్మద్ మాట్లాడుతూ...‘ సుమారు 18 నుంచి 19ఏళ్ల వయసు ఉన్న జంట...కారులో ముద్దు పెట్టుకుంటూ సన్నిహితంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. మా పోలీసులు అక్కడకు వెళ్లేవరకూ వాళ్లు ఇంకా అలాగే ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కరాచీ కంపెనీ పోలీస్ స్టేషన్‌‌కు తీసుకు వచ్చాం. అనంతరం బెయిల్‌పై విడుదల చేశాం’ అని తెలిపారు. కాగా గతంలోనూ పార్కులు, షాపింగ్ మాల్స్‌లో దొరిగిన యువ జంటలను ఇస్లామాబాద్ పోలీసులు వేధించడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

Last Updated 9, Sep 2018, 2:02 PM IST